AP: Transfers and Postings of Village
and Ward Secretariat Employees - Guidelines – G.O. Released
ఏపీ: సచివాలయ ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలు విడుదల – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
=======================
ఉమ్మడి జిల్లా యూనిట్ గా వచ్చే నెల 10లోగా ప్రక్రియ పూర్తి
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను
జిల్లా పరిధిలో, వేరే జిల్లాలకు బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది. పాత
జిల్లాలు యూనిట్ గా అభ్యర్ధన బదిలీలుగా వీటిని చేపట్టనున్నారు. పురపాలక, నగరపాలక సంస్థల ప్రధాన కేంద్రంగానే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి. వీటి ఆన్లైన్
పోర్టల్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. వచ్చే నెల 10లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీల
మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
* 2019,
2020లో జారీచేసిన రెండు
నోటిఫికేషన్లలో నియమితులై, రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకుని, ప్రొబేషన్ ఖరారైన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఎనర్జీ అసిస్టెంట్లకు ఈ
ఉత్తర్వులు వర్తించవు.
* పాత జిల్లా యూనిట్గా బదిలీలు
నిర్వహిస్తారు. ఖాళీల వివరాలనూ అలాగే కలెక్టర్లు ప్రకటిస్తారు.
* జిల్లాల్లో 20 శాతానికి మించి బదిలీలు అనుమతించరు.
* మండలాల్లో, పట్టణ
స్థానిక సంస్థల్లో బదిలీలు 50% లోపే ఉంటాయి. ఒక మండలం నుంచి
బదిలీపై వెళ్లే వారు 50% ఉంటే... ఇతర ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చేవారు అంతే
శాతం ఉండేలా పరిమితి పెట్టారు.
* మండలం, పురపాలక సంఘం, నగరపాలక సంస్థ ప్రధాన కేంద్రంగా బదిలీల కోసం దరఖాస్తు చేయాలి. ఫలానా గ్రామ, వార్డు సచివాలయానికి బదిలీ చేయాలంటే అనుమతించరు. ఖాళీలను బట్టి బదిలీ
చేస్తారు.
* క్రమశిక్షణ చర్యలు, అనిశా, విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్న ఉద్యోగుల
దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
* విధినిర్వహణలో ప్రభుత్వానికి
ఎలాంటి బకాయిలు లేన్నట్లుగా సంబంధిత మండలాభివృద్ధికారి (ఎంపీడీవో)/ పుర, నగరపాలక కమిషనర్ల నుంచి ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు జతచేయాలి.
* ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు
చేయడంతో పాటు అప్లోడ్ చేసిన సమాచారాన్ని ధ్రువీకరించాలి.
* గడువు ముగిశాక దరఖాస్తులను
పరిశీలించి కేటగిరీల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాతో పాటు ర్యాంకునూ
పోర్టల్లో పెడతారు.
* వీటిపై అభ్యంతరాలను తెలియజేస్తే
జిల్లాస్థాయిలో పరిష్కార చర్యలు తీసుకొని సీనియారిటీ తుది జాబితాను మళ్లీ విడుదల
చేస్తారు.
* బదిలీ అయిన ఉద్యోగులకు టీఏ, డీఏలు చెల్లించరు.
అంతర్గత, అంతర జిల్లాల బదిలీలకు ప్రాధాన్యం
వివరాలు
* అవివాహితులు, వితంతువులకు..
* క్యాన్సర్, హృద్రోగ, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, ఎముకల సంబంధిత
టీబీ వ్యాధిగ్రస్థులకు...
* భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనా
వీరిలో ఒకరి అభ్యర్ధననే స్వీకరిస్తారు. ఇలాంటివారు మ్యారేజ్ సర్టిఫికెట్, ఉద్యోగి గుర్తింపుకార్డు జతచేయాలి.
* మ్యూచువల్ బదిలీలకూ మండల, పుర, నగరపాలక సంస్థల యూనిట్ గానే దరఖాస్తు చేయాలి.
=======================
Dept., of
GVMWV & VS/WS Human Resources - Transfers and Postings of Village and Ward
Secretariat employees - Guidelines / Instructions - Orders - Issued.
DEPARTMENT
OF GRAM VOLUNTEERS / WARD VOLUNTEERS & VILLAGE SECRETARIATS/WARD
SECRETARIATS
G.O.Ms.No.05,
Dated:25.05.2023.
=======================
=======================
0 Komentar