CBSE Results 2023: Class 10 Results
Declared
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల
==========================
సెంట్రల్
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.
శుక్రవారం (మే 12) ఉదయమే 12 వ తరగతి ఫలితాలను బోర్డు
వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పదో తరగతి ఫలితాలను కూడా
బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని బోర్డు
పేర్కొంది. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా
సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు
జరిగాయి. ఈ పరీక్షలకు 21లక్షల మందికి పైగా
విద్యార్థులు హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షల్లో 93.12శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
గత ఐదేళ్లలో
ఉత్తీర్ణత ఇలా..
సీబీఎస్ఈ పదో
తరగతి ఫలితాల్లో 2022 ఉత్తీర్ణతా శాతం 94.40 % గా ఉండగా.. 2018లో 86.7%, 2019లో 91.10%, 2020లో 91.46%, 2021లో 99.04%గా నమోదైంది.
==========================
==========================
0 Komentar