Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2023: CSK Wins Fifth Title – Chennai Records Equalling 5th Title with Mumbai

 

IPL 2023: CSK Wins Fifth Title – Chennai Records Equalling 5th Title with Mumbai

ఐపీఎల్‌-2023: ఐదోసారి టైటిల్ విజేత గా చెన్నై సూపర్ కింగ్స్ – 5 టైటిళ్ళతో  ముంబైతో రికార్డు సమం

==========================

ఐపీఎల్-2023 ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో  ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్ (మోహిత్ శర్మ)లో 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులు రావడంతో చివరి రెండు బంతులు సమీకరణం 10 పరుగులుగా మారింది. దీంతో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ తరుణంలో చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమే చేశాడు. జడ్డూ వరుసగా సిక్స్ఫోర్ బాదడంతో చెన్నై శిబిరం ఆనందంలో మునిగితేలింది. వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో కాన్వే(47), శివమ్ దూబె(32*), రహానె(27), రుతురాజ్(26), రాయుడు(19) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(96), సాహా(54), గిల్(39) చెలరేగి ఆడారు.

171 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్లు డెవాన్ కాన్వే(47: 25 బంతుల్లో 2 సిక్స్లు, 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్(26: 16 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్) మంచి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీరి జోడి 6.3 ఓవర్లలో 74 పరుగులు చేశారు. తొలి ఓవర్ నుంచే విరుచుకుపడిన వీరు ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్నారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో రుతురాజ్ రషీద్ ఖాన్కు చిక్కగా, మోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో కాన్వే ఔటయ్యాడు. దీంతో శివమ్ దూబె(32: 21 బంతుల్లో 2 సిక్స్లు) తో జట్టు కట్టిన అజింక్యా రహానె (27 *: 13 బంతుల్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు) ధాటిగా ఆడాడు. ఉన్నంత సేపు సిక్స్లు, ఫోర్లతో అలరించాడు. ఈ క్రమంలో 117 పరుగుల వద్ద రహానె భారీ షాట్కు ప్రయత్నించి మోహిత్ శర్మ బౌలింగ్లో విజయ్ శంకర్ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో చెన్నై బ్యాటింగ్ కొంచెం నెమ్మదించింది. అయితే 12వ ఓవర్లో రాయుడు (19: 8 బంతుల్లో 2 సిక్స్లు, 1 ఫోర్)తో విరుచుకుపడ్డాడు. మరోవైపు దూబె సైతం ధాటిగా అడడంతో చెన్నై విజయం దిశగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో 149 పరుగుల వద్ద రాయుడు, ధోనీ వరుస బంతుల్లో ఔట్ కావడంతో ఒకింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సాధించాల్సిన లక్ష్యం తక్కువే ఉండడం, క్రీజులో దూబే, జడేజా (15*: 6 బంతుల్లో సిక్స్, ఫోర్) ఉండడంతో చెన్నై గెలుపుపై ధీమాగానే ఉంది. అయితే చివర్ ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి నాలుగు బంతులకు మూడే పరుగులు రావడంతో గుజరాత్ విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే అనూహ్యంగా చెలరేగిన జడేజా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకి మరుపురాని విజయాన్నిందించాడు.

ఐపీఎల్‌-2023 అవార్డులు:  

విజేత: చెన్నై సూపర్ కింగ్స్ (ట్రోఫీ + రూ. 20 కోట్లు)

రన్నరప్: గుజరాత్ టైటాన్స్ (షీల్డ్ మరియు రూ. 12.5 కోట్లు)

ఉత్తమ వేదికలు: ఈడెన్ గార్డెన్స్ మరియు వాంఖడే స్టేడియం

ఆరెంజ్ క్యాప్: శుభమాన్ గిల్ (890 పరుగులు)

పర్పుల్ క్యాప్: మహ్మద్ షమీ (28 వికెట్లు)

ఫెయిర్ ప్లే ఆఫ్ ది సీజన్: ఢిల్లీ క్యాపిటల్స్

క్యాచ్ ఆఫ్ ది సీజన్: రషీద్ ఖాన్

లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ది సీజన్: ఫాఫ్ డు ప్లెసిస్ (115మీ)

అత్యధిక ఫోర్లు: శుభమాన్ గిల్ (84 ఫోర్లు)

మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: శుభమాన్ గిల్

డ్రీమ్11 గేమ్‌ఛేంజర్ ఆఫ్ ది సీజన్: శుభమాన్ గిల్

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: గ్లెన్ మాక్స్‌వెల్

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్

ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్: డెవాన్ కాన్వే

======================= 

CLICK HERE FOR HIGHLIGHTS

======================= 

Previous
Next Post »
0 Komentar

Google Tags