Jio
Cinema Launches Yearly Subscription Plan for Hollywood Content – Details Here
జియో సినిమా’ లో హాలీవుడ్ కంటెంట్ - ఏడాది ప్రీమియం
సబ్స్క్రిప్షన్ ప్లాన్ – వివరాలు ఇవే
========================
ఓటీటీ ప్లాట్ఫామ్ ‘జియో సినిమా’ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను
ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఉచితంగా కంటెంట్ ను
అందించిన ఆ సంస్థ ఇకపై యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది. ఇందుకోసం
కొత్తగా ఏడాది ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.999గా నిర్ణయించింది. HBO, వార్నర్ బ్రదర్స్ కంటెంట్ ఇకపై
జియో సినిమాలో వీక్షించొచ్చు.
12 నెలల పాటు ఉండే ఈ ప్లాన్ కింద
ఒకేసారి నాలుగు డివైజుల్లో కంటెంట్ ను వీక్షించొచ్చని జియో సినిమా చెబుతోంది.
ప్రస్తుతానికి వార్షిక ప్లాన్ ను మాత్రమే జియో తీసుకొచ్చింది. జియో సినిమా
వెబ్సైట్ లేదా యాప్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ప్లాన్ను కొనుగోలు
చేయొచ్చు. హెచ్బీఓ అందించే 'ద లాస్ట్ ఆఫ్ అజ్', 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్', 'వైట్ లోటస్' వంటి కంటెంట్ను వీక్షించొచ్చు. బాలీవుడ్ కంటెంట్తో పాటు ఐపీఎల్ ప్రసారాలను
మాత్రం ఎప్పటిలానే ఉచితంగా వీక్షించొచ్చు.
జియో సినిమా వేదికగా తొలుత ఫిఫా వరల్డ్ కప్ ను ఉచితంగా ప్రసారం చేసిన రిలయన్స్.. తర్వాత ఐపీఎల్ ప్రసారాలను సైతం అందరికీ ఉచితంగా అందించింది. అదే సమయంలో కొత్తగా కంటెంట్ ను యాడ్ చేసి రుసుములు వసూలు చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా HBO, మ్యాక్స్ ఒరిజినల్, వార్నర్ బ్రదర్స్ కంటెంట్ ను భారత్ లో ప్రసారం చేసుకునేందుకు వార్నర్ బ్రదర్స్ తో ఒప్పందం చేసుకుంది. తాజాగా అందుకు సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది.
========================
========================
0 Komentar