RBI to Withdraw Rs 2,000 Notes from Circulation
– Details Here
రూ.2వేల
నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం – వివరాలు ఇవే
=====================
రూ.2వేల నోట్ల ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు /
సందేహాలకు ఆర్బీఐ FAQs విడుదల చేసింది.
1. ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటోంది?
ఆర్బీఐ
చట్టం-1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం.
పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్లో
అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్లో అవసరమైన కరెన్సీ
అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం.
ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ. 2 వేల నోట్లన్నీ
మార్చి 2017కు ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం 4-5 ఏళ్లు మాత్రమే.
2. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందా?
అవును. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుంది.
3. సాధారణ లావాదేవీలకు ఈ నోట్లను ఉపయోగించవచ్చా?
వినియోగించొచ్చు.
రూ.2వేల నోటును సాధారణ లావాదేవీలకు ప్రజలు ఉపయోగించుకోవచ్చు.
వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను
బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం చేయాలి.
4. రూ.2 వేల నోటు కలిగి ఉన్నవారు ఏం చేయాలి?
రూ.2నోటు ఉన్నట్లయితే బ్యాంకుకు వెళ్లి వాటిని తమ అకౌంట్లో
డిపాజిట్ చేయడమో లేదా మార్చుకోవడమో చేయాలి. అయితే, ఈ సదుపాయం
2023 సెప్టెంబర్ 30వరకు ఉంటుంది. అన్ని
బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19
ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.
5. బ్యాంకు
అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడంపై ఏదైనా పరిమితి ఉందా?
బ్యాంకు
అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడంపై ఎటువంటి ఆంక్షలూ లేవు. కేవైసీ, ఇతర నిబంధనలను అనుసరించి వాటిని డిపాజిట్ చేసుకోవచ్చు.
6. రూ.2 వేల నోటు మార్చుకునేందుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా?
ప్రజలు
ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే అవకాశం
ఉంటుంది.
7. ఈ
నోట్లను బిజినెస్ కరెస్పాండెంట్ (బీసీ)లతో మార్చుకోవచ్చా?
మార్చుకోవచ్చు.
అయితే, బ్యాంకుల్లో ఉండే బిజినెస్ కరెస్పాండెంట్ల
నుంచి రోజుకు కేవలం రూ.4వేలు మాత్రమే మార్చుకోవచ్చు.
8. ఏ
తేదీ నుంచి నోట్లను మార్చుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది?
2023 మే
23 నుంచి మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుంటుంది. ప్రజలకు
అసౌకర్యం కలగకుండా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ గడువు ఇవ్వడం జరిగింది.
9. అకౌంటు
ఉన్నవారు అదే బ్రాంచి లో మార్చుకోవాలా?
లేదు. ఏ
బ్యాంకులోనైనా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
అయితే,
ఒక బ్రాంచీలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.
10. ఎవరికైనా రూ.20వేలకంటే ఎక్కువ
అవసరమైతే ఏం చేయాలి?
డిపాజిట్ పై ఆంక్షలు లేవు. రూ.2వేల నోట్లు ఎన్ని ఉన్నా తమ
అకౌంట్లో డిపాజిట్ చేయవచ్చు. అనంతరం తమ అవసరానికి అనుగుణంగా వాటిని విత్ డ్రా
చేసుకోవచ్చు.
II. నోట్లను మార్చుకోవడానికి అదనంగా ఏమైనా చెల్లించాలా?
లేదు. నోట్ల
మార్పిడి పూర్తిగా ఉచితం
12. వయోవృద్ధులు, వికలాంగుల కోసం
బ్యాంకుల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయా?
వయోవృద్ధులు, వికలాంగులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు
చేసుకోవాలని బ్యాంకులకు సూచించాం.
13. తక్షణమే రూ.2వేల నోటును డిపాజిట్ చేయకుంటే
ఏమవుతుంది?
ఈ ప్రక్రియ
సజావుగా సాగేందుకు వీలుగా నాలుగు నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గడువులోగా
వాటిని డిపాజిట్ చేయడమో లేదా మార్చుకోవడమే చేయాలని సూచిస్తున్నాం.
14. రూ.2వేల నోటును తీసుకునేందుకు బ్యాంకు నిరాకరిస్తే ఏం చేయాలి..?
సేవల్లో
ఏదైనా లోపం జరిగితే వినియోగదారుడు తొలుత బ్యాంకు అధికారులను సంప్రదించాలి.
ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంకు
స్పందించకపోవడం లేదా బ్యాంకు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే రిజర్వు
బ్యాంకు-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ (RB-IOS), 2021 కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
FAQs on 2000 NOTES
CIRCULATION
FAQs
on 2000 NOTES CIRCULATION PDF
=====================
రూ.2వేల
నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక
నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ
చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.2వేల నోట్ల నోట్లను
చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకోనుంది.
రూ.2వేల
నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా మర్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. 2018-19
ఆర్థిక సంవత్సరంలోనే రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ స్పష్టం చేసింది.
దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం
కల్పిస్తున్నట్టు పేర్కొంది.
=====================
=====================
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023
0 Komentar