Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC CHSL Exam 2023: All the Details Here

 

SSC CHSL Exam 2023: All the Details Here

ఎస్ఎస్సీ - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2023  – జీతభత్యాలు: నెలకు రూ.19,900 - 92,300.

========================

ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023' (సీహెచ్ఎస్ఎల్) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎన్ఎస్సీ) 2023 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారెవరైనా జూన్ 8లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ..

ఎస్ఎస్సీ - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్- 2023

ఖాళీలు: 1,600

1. లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

2. డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)

3. డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు: 01-08-2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1996 నుంచి 01-08-2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

జీతభత్యాలు:

ఎల్డీసీ, జేఎస్ఏ పోస్టుల కు రూ.19,900-63,200.

డేటా ఎంట్రీ ఆపరేటర్ కు రూ.25,500-81,100.

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ కు రూ.29,200-92,300.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-05-2023.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 08-06-2023.

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-06-2023.

టైర్-1(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: ఆగస్టులో నిర్వహిస్తారు

టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

========================

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 9 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags