Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC-NET-JUNE 2023: All the Details Here

 

UGC-NET-JUNE 2023: All the Details Here  

యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ - జూన్ 2023 – పూర్తి వివరాలు ఇవే

======================= 

UPDATE 25-07-2023

ఫలితాలు విడుదల

యూజీసీ- నెట్ జూన్ 2023 పరీక్ష ఫలితాలు జులై 25న వెల్లడయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చు. జూన్ 13 నుంచి జూన్ 22వరకు ఆన్లైన్ విధానంలో యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించి సంగతి తెలిసిందే. మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 6,39,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది.

CLICK FOR RESULTS

FINAL ANSWER KEYS

CUTOFF TABLE FOR JRF

CUTOFF TABLE FOR ASSISTANT PROFESSOR

WEB NOTE ON SCORE CARD

WEBSITE

======================= 

UPDATE 08-06-2023

పరీక్ష తేదీలు మరియు పరీక్ష కేంద్రం సిటీ వివరాలు ఇవే

యూజీసీ- నెట్ కు సంబంధించి ఫేజ్-1 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. యూజీసీ-నెట్ ఫేజ్-1 పరీక్షలు జూన్ 13 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను వెల్లడించింది. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగనుంది. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

CENTRE CITY TO THE APPLICANT

PRESS NOTE ON EXAM DATES

WEBSITE

=======================

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2023 (యూజీసీ- నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్లో నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఈ పరీక్షకు మే 10 నుంచి మే 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2023

సబ్జెక్టులు: అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ తదితరాలు. అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జేఆర్ఎఫ్కు 01.06.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్రిజర్వ్డ్కు రూ. 1150; జనరల్ - ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ- ఎన్సీఎల్ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్కు రూ.325.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-05-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.

పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 01-06-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 02-03 జూన్, 2023.

పరీక్ష తేదీలు: 13-06-2023 నుండి 22-03-2023 వరకు

=======================

INFORMATION BULLETIN

APPLY HERE

PUBLIC NOTICE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags