UPSC NDA & NA (II) Exam 2023: All
the Details Here
యూపిఎస్‌సి
– ఎన్‌డిఏ&ఎన్‌ఏ (2) ఎగ్జామ్ 2023: పూర్తి వివరాలు ఇవే
==========================
UPDATE
26-09-2023
యూపిఎస్‌సి – ఎన్‌డిఏ&ఎన్‌ఏ (2) ఎగ్జామ్ 2023 ఫలితాలు విడుదల
ఎన్డీఏ అండ్ ఎన్ఏ (2) 2023 రాత పరీక్ష
ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. మే నెలలో
మొత్తం 395 ఖాళీలకు ప్రకటన వెలువడగా సెప్టెంబర్ 3న ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ఎంపిక రెండు
దశల్లో జరుగుతుంది.
రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా
ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 02-06-2024 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులో, 114వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు
విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు.
==========================
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..152 వ
కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఏ), 114వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత
పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
National Defence Academy and Naval
Academy Examination (II), 2023
ఎన్‌డిఏ
అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2023
మొత్తం
ఖాళీలు: 395
1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్-120)
2) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ
స్కీమ్): 25
అర్హత: ఆర్మీ
వింగ్ పోస్టులకి ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్
సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
ఎంపిక:
రాతపరీక్ష, ఎస్ఎస్ బీ టెస్ట్/ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ప్రకటనలో సూచించిన
అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేది: 17.05.2023.
ఆన్లైన్
దరఖాస్తులకి చివరి తేది: 06.06.2023.
పరీక్ష తేది:
03.09.2023.
కోర్సు
ప్రారంభం: 02.07.2024
==========================
==========================
0 Komentar