AP: Academic Calendar 2023-24 for Classes
1 to 10
=============================
Academic Calendar for 2023-24
Primary Classes: Classes 1 to 5
High Schools: Classes 6 to 10
=============================
ఏపీ లో నూతన
విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12 నుంచి బడులు తెరుచుకోనుండగా.. పాఠశాల
విద్యాశాఖ 2023-24 అకడమిక్ కేలండర్ను జూన్ 8న విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం..
నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పని చేయనుండగా అన్ని రకాలు కలిపి 88
సెలవులు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు
ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్ను క్రీడలకు ఐచ్ఛికంగా పేర్కొన్నారు.
ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం టీచర్, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్ చెప్పాలని విద్యాశాఖ సూచించింది. ఇంగ్లిష్ టీచర్లతో పాటు డిగ్రీ, పీజీలో ఆంగ్ల సబ్జెక్టు చదివిన వారందరూ టోఫెల్ బోధనలో సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో టోఫెల్ పరీక్ష నిర్వహించాలని సూచించింది. శనివారం రెండో శనివారం అయితే శుక్రవారమే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి, రెండు తరగతులకు మొదటి, రెండు శనివారాల్లో నో బ్యాగ్ డేను అమలు చేయాలని కేలండర్లో పేర్కొన్నారు. కాగా వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
దసరా
సెలవులు: 14-10-2023 నుండి 24-10-2023 వరకు
క్రిస్మస్
సెలవు: 25-12-2023
సంక్రాంతి సెలవులు:
09-01-2024
నుండి 18-01-2024 వరకు
=============================
CLICK
FOR HIGH SCHOOLS CALENDAR
=============================
0 Komentar