Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights - 07-06-2023

 

AP Cabinet Meeting Highlights - 07-06-2023

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే - 07-06-2023

=========================

ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 'ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు-2023' పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే

> 'ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు-2023' పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు ఆమోదం.

> కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు ఆమోదం.

> 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

> కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం.

> రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల (2014, జూన్ 2 నుంచి పని చేస్తున్నవాళ్లు) క్రమబద్దీకరణకు ఆమోదం.

> అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు పథకంతో పాటు ఈ ఏడాది విద్యాకానుక

> 2022, జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్తో 2.73 శాతం డీఏ

అమలునకు కేబినెట్ ఆమోదం.

> జిల్లా కేంద్రాల్లో పని చేసేవాళ్లకు 12 నుంచి 16 శాతానికి హెచ్ఆర్ఏను పెంచింది.

> 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్ బెటాలియన్ ఖాళీలు 3,920 పోస్టులు ఉన్నాయి. అలాగే కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి.

> బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ ఉద్యోగులకు ఆమోదం.

> కో-ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం.

> కడప మానసిక వైద్య కళాశాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం.

> సీతానగరం పీహెచ్సీ అప్గ్రేడ్ కు 23 పోస్టులకు ఆమోదం.

> పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. డయాలసిస్ యూనిట్కు 41 మెడికల్ ఆఫీసర్లకు ఆమోదం.

> 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు ఆమోదం.

> గ్రూప్-1, 2 పోస్టుల నియమకాలకు ఆమోదం.

> అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్గ్రేడ్ కు ఆమోదం.

> రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం.

> చిత్తూరు డెయిరీ ప్లాంటు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు ఆమోదం.

> ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం.

> జగనన్న అమ్మ ఒడి పథకం అమలును జూన్ 28 తేదీకి వాయిదా వేస్తూ కేబినెట్ నిర్ణయం.

> 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్లను వ్యయం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం.

> గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్ఎస్ఎల్ కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం.

> జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాల నిర్వాహణకు, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం.

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags