Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Formation Of New Sub-District & Establishment of Offices of Sub-Registrars / Joint Sub-Registrar – G.Os Released

 

AP: Formation Of New Sub-District & Establishment of Offices of Sub-Registrars / Joint Sub-RegistrarG.Os Released

ఏపీ: కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్ లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

=========================

ఏపీ లో భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టేలా కొన్ని జిల్లాల్లో కొత్తగా సబ్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ తరపున నోటిఫికేషన్ జారీ అయ్యింది. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్ లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కొత్త సబ్ డిస్ట్రిక్ట్లోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 5 ప్రకారం ఈ కొత్త సబ్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నోటిఫికేషన్లో పేర్కొన్న గ్రామాలు ఇక నుంచి కొత్త సబ్ డిస్ట్రిక్ట్ ల పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిని కూడా నోటిఫికేషన్లో పేర్కొంది.

=========================

FORMATION OF NEW SUB-DISTRICT UNDER SEC.5 OF REGISTRATION ACT, 1908 TO ENSURE SPEEDY DELIVERY OF SERVICES AT THE DOOR STEPS OF THE PEOPLE ON COMPLETION OF RESURVEY. 

[G.O.Ms.No.284, Revenue (Reg.I), 23rd June, 2023.]

DOWNLOAD G.O.284

=========================

ESTABLISHMENT OF OFFICES OF SUB-REGISTRARS / JOINT SUB-REGISTRAR UNDER SECTION 7(1) OF REGISTRATION ACT, 1908 TO ENSURE SPEEDY DELIVERY OF SERVICES AT THE DOOR STEPS OF THE PEOPLE ON COMPLETION OF RESURVEY.

[G.O.Ms.No.285, Revenue (Reg.I), 23rd June, 2023.]

DOWNLOAD G.O.285

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags