AP OAMDC-2023-24 Admissions: Online Admissions for Degree
Colleges – Details Here
ఏపీ: డిగ్రీ 2023-24 ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ
ప్రారంభం – పూర్తి వివరాలు ఇవే
=========================
ఆంధ్ర ప్రదేశ్ లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ (OAMDC) విడుదల అయ్యింది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఎయిడెడ్ / ప్రైవేటు అన్ ఎయిడెడ్ / అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను ఆదివారం ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి. వొకేషనల్, బీఎస్ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో
చేరేందుకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని OAMDC కన్వీనర్ ఓ
ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులైతే రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైన
విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు క్రింది వివరాల చూడండి .
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం: 19/06/2023
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చివరి తేదీ: 26/06/2023
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ తేదీలు: 26/06/2023 నుండి 30/06/2023 వరకు
సీట్ల కేటాయింపు: 03/07/2023 న
తరగతులు ప్రారంభం: 04/07/2023 నుంచి
=========================
DISTRICT
WISE HELPLINE CENTERS
=========================
0 Komentar