French Open Women’s Final 2023: Iga
Swiatek Retains Roland Garros Title After Overcoming Karolina Muchova in Thrilling
Final
ఫ్రెంచ్
ఓపెన్ - 2023 విజేత గా ఇగా స్వైటెక్ - 3వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మరియు మొత్తంగా 4 వ గ్రాండ్ స్లామ్ తో మహిళల
నెం.1
========================
2023 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో స్వైటెక్ (పోలెండ్) అదరగొట్టింది.
హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ముచోవా (చెక్ రిపబ్లిక్)ను 6-2, 5-7, 6-4 తేడాతో ఓడించి టైటిల్ పట్టేసింది. దీంతో ఎర్రమట్టి
కోర్టులో వరుసగా రెండో సారి, నాలుగేళ్లలో మూడో
సారి టైటిల్ సాధించింది. మరోవైపు 2020, 2022లో స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గింది. నిరుడు యూఎస్ ఓపెన్ లోనూ
విజేతగా నిలిచింది.
శనివారం
జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ రసవత్తరంగా సాగింది. మొదటి సెట్లో స్వైటెక్ పూర్తి
ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది.
కానీ,
అనూహ్యంగా పుంజుకొన్న ముచోవా రెండో సెట్లో పైచేయి
సాధించింది. అనంతరం విజయం మూడో సెట్ మీద ఆధారపడడంతో ఇద్దరూ పోటాపోటీగా ఆడారు.
ముచోవా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆఖర్లో స్వైటెక్ ను విజయం వరించింది.
ప్రపంచ నంబర్ వన్ స్వైటెక్ జోరు కొనసాగిస్తూ ఫ్రెంచ్ ఓపెన్ ను మరోసారి ముద్దాడింది. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వైటెక్ 6-2, 5-7, 6-4తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభంలో స్వైటెక్ దూకుడు చూస్తే ఫైనల్ ఏకపక్షం అయ్యేలా కనిపించింది. తొలి సెట్ గెలిచి.. రెండో సెట్లో 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న స్వైటెక్.. ఛాంపియన్షిప్ గెలిచేందుకు మూడు గేమ్ దూరంలో నిలిచింది. కానీ అనూహ్యంగా పుంజుకున్న ముచోవా.. ఇగాకు గట్టిపోటీ ఇచ్చింది. తొలి సెట్తో పోలిస్తే మెరుపు సర్వీసులతో విజృంభించిన ఈ చెక్ అమ్మాయి.. ఫోర్యోండ్ విన్నర్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీంతో అనవసర తప్పిదాలు చేసిన ఇగా.. అయిదో గేమ్లో సర్వీస్ కోల్పోయింది.
ముచోవా పట్టు
వదలకపోవడం.. స్వైటెక్ తగ్గకపోవడంతో సెట్ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. పదకొండో
గేమ్ మరో బ్రేక్ సాధించిన ముచోవా.. ఆ తర్వాత సర్వీస్ నిలబెట్టుకుని సెట్ గెలిచి
మ్యాచ్లో నిలిచింది. ఆఖరి సెట్ ఆరంభంలోనూ సర్వీస్ కోల్పోయినా.. ముచోవా పోరాటం
ఆపలేదు. ఆ తర్వాత స్వైటెక్ సర్వీస్ బ్రేక్ చేసి మళ్లీ స్కోరు సమం చేసింది. కానీ
ఒత్తిడిలోనూ స్థిరంగా ఆడి తొమ్మిదో గేమ్ నిలబెట్టుకున్న ఇగా 5-4తో విజయం ముంగిట నిలిచింది. పదో గేమ్లో 15-40తో వెనుకబడిన సమయంలో ముచోవా డబుల్ ఫాల్ట్ చేయడంతో ఇగా
సెట్తో పాటు టైటిలు ఎగరేసుకుపోయింది. మిక్స్డ్ డ్ డబుల్స్ టైటిల్ను కాట్లో
(జపాన్)-పజ్ (జర్మనీ) జోడీ నెగ్గింది. ఫైనల్లో ఈ జోడీ 4-6, 6-4, 10-6తో ఆండ్రెస్క్యూ (కెనడా)- మైకేల్ వీనస్ (ఆస్ట్రేలియా)ను
ఓడించింది.
========================
Suz and Iga, together again 😘🏆#RolandGarros pic.twitter.com/Nwd5Das6rD
— Roland-Garros (@rolandgarros) June 10, 2023
HIGHLIGHTS BY EMIRATES
— Roland-Garros (@rolandgarros) June 10, 2023
What a match! Congratulations to both players for this incredible final! #FlyBetter #RolandGarros @emirates pic.twitter.com/ZY7qcRVTPE
0 Komentar