IB Recruitment 2023: Apply for 797 Junior
Intelligence Officer Posts – Details Here
ఇంటెలిజెన్స్
బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
పోస్టులు – జీతాభత్యాలు: రూ.25,500 - రూ.81,100 (కేంద్రం ఇచ్చే ఇతర
అలవెన్సులు అదనం)
========================
కేంద్ర
హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీలో 797 జూనియర్
ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిప్లొమా/ డిగ్రీ
పూర్తిచేసి ఆసక్తికలిగిన అభ్యర్థులు జూన్ 3 నుంచి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
జూనియర్
ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (జేఐవో) గ్రేడ్-2/ టెక్నికల్: 797 పోస్టులు (యూఆర్- 325, ఎస్సీ- 119, ఎస్టీ- 59, ఓబీసీ - 215, ఈడబ్ల్యూఎస్- 79)
విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ విద్యా సంస్థ నుంచి డిప్లొమా ఇన్
ఇంజినీరింగ్(ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ
(ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్/ మేథమెటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి).
లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి:
18 నుంచి 27 ఏళ్లు లోపు ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు/ ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో సడలింపు ఉంటుంది.
వేతన స్కేలు:
రూ.25,500
- రూ.81,100 (కేంద్రం ఇచ్చే ఇతర అలవెన్సులు అదనం)
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష (100 మార్కులు), స్కిల్ టెస్ట్ (30 మార్కులు), ఇంటర్వ్యూ (20 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎమినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.500.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్షల కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/
సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 03-06-2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 23-06-2023.
ఫీజు
చెల్లింపు చివరి తేదీ: 27-06-2023.
========================
========================
0 Komentar