NIRF Ranking 2023: IIT Madras Tops Again
in Ministry of Education’s India Rankings 2023
వరుసగా ఐదో ఏడాది
ఉత్తమ విద్యా సంస్థ గా ఐఐటీ మద్రాస్ – NIRF ర్యాంకులను విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ
===========================
2023 సంవత్సరానికి సంబంధించి విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్ర
ప్రభుత్వం విడుదల చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్(NIRF) కింద కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్
ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్
టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఐఐటీ మద్రాస్ వరుసగా 5వసారి అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. రెండు, మూడు స్థానాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, ఐఐటీ- ఢిల్లీ నిలిచాయి. కాగా టాప్ 10 విద్యాసంస్థల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఆల్ ఇండియా
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ తొలి పది స్థానాలో నిలిచాయి.
ఇంజనీరింగ్ విభాగంలో
మొదటి స్థానాన్ని ఐఐటీ (మద్రాస్) కైవసం చేసుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే తరువాతి స్థానాల్లో నిలిచాయి. 8వ స్థానంలో ఐఐటీ (హైదరాబాద్), 21వ స్థానంలో ఎన్ఐటీ (వరంగల్) నిలిచాయి.
మేనేజ్‌మెంట్
విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్ రెండు, మూడు
స్థానాల్లో ఉన్నాయి.
ఫార్మసీ
విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్
అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్‌దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో
స్థానాల్లో నిలిచాయి.
న్యాయ విద్యలో
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని - నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా తొలి మూడు
స్థానాల్లో నిలిచాయి.
===========================
CLICK FOR UNIVERSITIES
RANKINGS
CLICK
FOR COMPLETE RANKING REPORT
===========================
🏆 India Rankings 2023 🇮🇳
— Ministry of Education (@EduMinOfIndia) June 5, 2023
Presenting the top 5 Higher Education Institutions in India! 🔝@dpradhanbjp @RanjanRajkuma11 @Drsubhassarkar @Annapurna4BJP pic.twitter.com/3N4vt2dEtH
0 Komentar