SonuSood: "SAMBHAVAM 2023-24” Free
IAS Coaching Program - Details Here
సోనూసూద్:
సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతోన్న విద్యార్థులకు సంభవం 2023-24’ పేరుతో ఉచిత శిక్షణ కార్యక్రమం – వివరాలు ఇవే
========================
కరోనా వేళ, దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు చూరగొన్నారు
నటుడు సోనూసూద్. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకునే వారికి అండగా నిలవాలనుకుంటున్నారు.
‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు మరోసారి ముందుకొచ్చారు. ఈ
విషయాన్ని నేడు (జూన్ 24) ఆయన ట్విటర్ వేదికగా
వెల్లడించారు.
సివిల్
సర్వీసెస్‌కు సిద్ధం అవుతోన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు
తెలిపారు. అలాగే దరఖాస్తుల సమర్పణకు జులై 9 చివరి తేదీ. వెబ్‌సైట్ వివరాలను ఆ
ట్వీట్‌లో పొందుపరిచారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆయన తన సేవా కార్యక్రమాలను
విస్తరిస్తున్నారు.
సందర్భంగా సోనూ సూద్ చెబుతూ, ఐఏఎస్ కావాలనుకునే పేద వారికి సమాన అవకాశాలు అందించాలనే ఉద్దేశ్యంతో, వారికి సరైనా జ్ఞానం అందించాలనేది మా ఉద్దేశ్యం అని చెప్పారు. సోనూసూద్ చొరవతో ఆయన ఫౌండేషన్‌తో కలిసి ఈ మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం` అని డిఐవైఏ నిర్వహకులు మనీష్ కుమార్ సింగ్ తెలిపారు.
గతం లో లాక్‌డౌన్
కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ఈ రియల్ హీరో సొంతంగా రవాణా
సదుపాయాలు కల్పించారు. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రయాణం కరోనా రెండో దశలోనూ
కొనసాగుతోంది. కరోనా బారిన పడినవారికి వైద్యం అందించడం, అత్యవసరంగా ఆక్సిజన్ అందుబాటులో ఉంచి ఆదుకోవడం.. వంటి
కార్యక్రమాలతో ప్రజల మదిలో సూపర్ హీరోగా స్థానం సంపాదించారు.
దరఖాస్తులకు
చివరి తేదీ: 09-07-2023
========================
=========================
IAS देश बनाते हैं 🇮🇳
— sonu sood (@SonuSood) June 24, 2023
हम IAS बनाएँगे |
Back In Action with our 2023 Free IAS Coaching Scholarships!
Details on: https://t.co/juJL7Wk4oo#SoodCharityFoundation#FreeIasCoachingScholarahips@diyanewdelhi@SoodFoundation 🇮🇳 pic.twitter.com/oFhdl9Fiev
0 Komentar