APOSS: SSC &
Inter Admissions 2023-24: All the Details Here
10వ
తరగతి మరియు ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యా కోర్సుల ప్రవేశాలు 2023-24 – పూర్తి వివరాలు ఇవే
=========================
ఆంధ్రప్రదేశ్
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఈ నెల 26 నుంచి అడ్మిషన్ల
ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కేవీ
శ్రీనివాసులురెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ
విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్
సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపుతామని తెలిపారు. ప్రస్తుత విద్యా
సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ, అధ్యయన
కేంద్రాలకు ఉండాల్సిన అర్హతలువంటి అంశాలపై అన్ని జిల్లాల సమన్వయకర్తలు, అసిస్టెంట్ కమిషనర్లకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 26/07/2023
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 25/09/2023
దరఖాస్తు రుసుము
చెల్లింపు చివరి తేదీ: 26/09/2023
ఆలస్య రుసుము తో దరఖాస్తు చివరి తేదీ: 05/10/2023
=========================
APOSS YOUTUBE CHANNEL
‘జ్ఞానధార’యూట్యూబ్
చానల్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యం లో 'ఏపీఓఎస్ఎస్- జ్ఞానధార' ప్రత్యేక
యూట్యూబ్ చానల్ ను గురువారం ప్రారంభించారు. ఇందులో
పది,
ఇంటర్ విద్యార్థులకు వీడియో పాఠ్యాంశాలు అందుబాటులో
ఉంచుతామని శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
=========================
APOSS GNANADHARA YOUTUBE
CHANNEL
=========================
0 Komentar