Central Bank of India Recruitment 2023: Apply
for 1000 Manager Scale II Post – Details Here
సెంట్రల్
బ్యాంకులో 1000 మేనేజర్ స్కేల్ -2 పోస్టులు - పే స్కేల్:
నెలకు రూ.48,170 - రూ. 69,810.
==========================
సెంట్రల్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్
మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. . . రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు
శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషనన్ను విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
మేనేజర్
(మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2: 1000 పోస్టులు
అర్హత: ఏదైనా
డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎన్బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/
ఆర్ఆర్బీలో ఆఫీసర్గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎస్ బీ/ ప్రైవేట్ సెక్టార్
బ్యాంక్/ ఆర్ఆర్ బీలో క్లర్క్ గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/
ఎంసీఏ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై
వయోపరిమితి: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్:
నెలకు రూ.48,170 - రూ. 69,810.
పోస్టింగ్ స్థలం: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
రుసుము: రూ. 850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.07.2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.
ఆన్లైన్
పరీక్ష తేదీ: ఆగస్టు రెండు/ మూడో వారం, 2023.
==========================
==========================
0 Komentar