Google might Delete Your Gmail Account
If You Haven’t Logged in for Two Years
మీరు క్రియేట్
చేసిన జీ-మెయిల్ అకౌంట్ ను చాలరోజులుగా వాడట్లేదా? ఆ అకౌంటు ని గూగుల్ డిలీట్ చేసే
అవకాశం – యాక్టివ్ గా ఉంచుకోవటం ఎలా?
==========================
ప్రముఖ టెక్నాలజీ
సంస్థ గూగుల్ తమ అనుబంధ ఫీచర్ జీ-మెయిల్ వినియోగంలోని ఖాతాలకు సంబంధించి కీలక
నిర్ణయం తీసుకుంది. కనీసం రెండేళ్లకు మించి ఉపయోగంలోని జీ-మెయిల్, యూట్యూబ్ ఖాతాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు
ఇనాక్టివ్ అకౌంట్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులకు సంబంధించి యూజర్లకు
ఇప్పటికే హెచ్చరిక సందేశాలు కూడా పంపిస్తోంది. వెంటనే ఖాతాను యాక్టివేట్
చేసుకోవాలని, లేదంటే వాటిని తొలగిస్తామని
చెబుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వినియోగదారుల డేటా భద్రతను మరింత మెరుగు
పరచుకోవచ్చని గూగుల్ చెబుతోంది.
సాధారణ ఖాతాల
కంటే ఇన్యాక్టివ్ అకౌంట్లకు అథెంటికేషన్ ఫ్యాక్టర్ సెటప్ ప్రామాణికత 10 రెట్లు తక్కువగా ఉంటుందని, ఫలితంగా ఆ అకౌంట్ ను హ్యాకర్లు సులభంగా స్వాధీనం చేసుకునేందుకు వీలుంటుందని
పేర్కొంది. ఆ ఖాతా ద్వారా పలువురికి తప్పుడు మెయిల్స్ పంపించి సైబర్ నేరాలకు
పాల్పడే అవకాశముందని గూగుల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నిరుపయోగంగా ఉన్న
ఖాతాలను తొలగించాలని నిర్ణయించినట్లు గూగుల్ వెల్లడించింది.
కొత్త విధానం
డిసెంబరు 2023 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు
గూగుల్ పేర్కొంది. ఈ లోగా యూజర్లు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవాలని లేదంటే సంబంధిత
ఖాతాతో ముడిపడి ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుందని పేర్కొంది. అంటే, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, డాక్స్, మీట్, క్యాలెండర్, గూగుల్
ఫొటోలు తదితర డేటాను యూజర్ కోల్పోవాల్సి ఉంటుంది. అయితే, గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త విధానం కేవలం వ్యక్తిగత ఖాతాలకు
మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు, గేమింగ్ సంస్థలు, వ్యాపార
సంస్థలు తదితర ఆర్గనైజేషన్లకు వర్తించదని గూగుల్ స్పష్టం చేసింది.
అకౌంట్ ను
యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
> గూగుల్
అకౌంట్ ఉండి.. కనీసం 2 ఏళ్లుగా దానిని
ఉపయోగించకపోతే... కచ్చితంగా ఆ మెయిల్ ఐడీ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
> అప్పటికే
ఇన్బాక్స్ లోకి వచ్చిన మెయిల్ ని చదవండి. లేదంటే వేరే వాళ్లకి కనీసం ఒక మెయిల్
చెయ్యండి.
> గూగుల్
డ్రైవ్ ను ఉపయోగించండి.
> జీమెయిల్
ఖాతాతో అనుసంధానించి యూట్యూబ్లో వీడియో చూడండి.
> గూగుల్
ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి
> గూగుల్
సెర్చ్ ఆప్షన్ ను వినియోగించండి.
> మీ
జీమెయిల్ ఖాతాతో ఏదైనా థర్డపార్టీ యాప్ లోకి లాగిన్ అవ్వండి.
==========================
0 Komentar