IBPS
Recruitment 2023: Apply for 4545 CRP CLERKS-XIII Posts – Details Here
ఐబీపీఎస్-సీఆర్ పీ-XIII 4545 క్లర్క్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
=========================
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2024-2025 సంవత్సరానికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్(సీఆర్పీ)-XIII నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 4545 ఖాళీలు
ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులకు
సంబంధించిన శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది.
అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస
కంప్యూటర్ పరిజ్ఞానం.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్
రాసే అవకాశం ఉంటుంది.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్
సింధ్ బ్యాంక్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-07-2023
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21-07-2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు లేదా సెప్టెంబరుల్లో
జరుగుతుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబరు, 2023లో
నిర్వహిస్తారు.
=========================
=========================
0 Komentar