Jio New 4G Mobile: Phone Launched in
India at Rs 999 with Name ‘Jio Bharat’ – Details Here
జియో కొత్త 4G మొబైల్: ‘జియో భారత్’ పేరుతో, ధర రూ. 999తో కొత్త మొబైల్ విడుదల – ఫీచర్ల వివరాలు ఇవే
=========================
టెలికాం
సంస్థ రిలయన్స్ జియో 2జీ వినియోగదారులను 4జీకి మార్చే లక్ష్యంతో ‘జియో
భారత్’పేరుతో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. దీని ధరను ‘రూ. 999’గా నిర్ణయించింది.
ఇందులో 4జీ నెట్ వర్క్, అపరిమిత కాల్స్, యూపీఐ పేమెంట్స్ వంటివి సదుపాయాలు అందిస్తున్నారు. జులై 7
నుంచి 10 లక్షల మందితో జియో భారత్ బీటా ట్రయల్స్ నిర్వహిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో
తెలిపింది.
దేశంలో ఇప్పటికీ 25 కోట్ల మంది 2జీ మొబైల్స్ వాడుతున్నారని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియో నెట్వర్క్ తీసుకొచ్చినప్పుడే ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. అందులో భాగంగానే జియో భారతన్ను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ మొబైల్కు నెలకు రూ.123 రీఛార్జి చేయాల్సి ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 14 జీబీ డేటా (రోజుకు 0.5జీబీ) వస్తుంది. అదే సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జి చేయాల్సి ఉంటుంది. రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది.
ఫీచర్ల
వివరాలు
కార్బన్
కంపెనీ తయారు చేసిన ఫోన్. రెండు రంగుల్లో లభిస్తుంది. ఇందులో 1.77 అంగుళాల
క్యూవీజీఏ డిస్ప్లే ఉంటుంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. జియో సిమ్ లాకై
ఉంటుంది. ఇందులో జియో సినిమా, జియో సావన్ వంటి
ఎంటర్టైన్మెంట్ యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తాయి. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు
వీలుగా జియో పే యాప్ ను అందిస్తున్నారు. టార్చ్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం జాక్, 0.3 ఎంపీ కెమెరా వంటివి అందిస్తున్నారు. డివైజ్ స్టోరేజీని
ఎసీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది. దగ్గర్లోని రిటైల్
స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుందని జియో తెలిపింది.
=========================
Get Ready for #JioBharat 🇮🇳🙏 #WithLoveFromJio ❤️ #DigitalIndia #JioSaavn #JioCinema #Music #India #Bharat pic.twitter.com/C60WK7Nzvg
— Reliance Jio (@reliancejio) July 3, 2023
0 Komentar