Jio Adds Two New Data Booster Plans – Details
Here
జియో కొత్త ప్రీపెయిడ్
డేటా బూస్టర్ ప్లాన్ లు - వివరాలు ఇవే
=======================
జియో తమ వినియోగదారులకు
తక్కువ ధరకే రెండు ప్రీపెయిడ్ డేటా ప్లాన్లను తీసుకొచ్చింది. అత్యవసర
పరిస్థితుల్లో ఎక్కువ డేటా అవసరమైనప్పుడు తక్కువ ధరకే రీఛార్జ్ చేసుకునేలా
సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. కొత్త ప్లాన్లలో రూ.19, రూ.29 ధరలలో అందుబాటులో
ఉన్నాయి.
జియో తీసుకొచ్చిన ఈ రెండు ప్లాన్లు అత్యవసర పరిస్థితుల్లో
ఎక్కువ డేటా అవసరమయ్యే వ్యక్తులు పొందొచ్చు. జియో ఇప్పటికే అలాంటి డేటా బూస్టర్
ప్లాన్లను అందిస్తోంది.
రూ.19 ప్లాన్..
రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్లలో మొదటి ప్లాన్
ధర రూ.19. ఈ డేటా ప్యాక్‌తో యూజర్లు 1.5GB డేటాను
పొందుతారు. రూ.19 ప్లాన్ ద్వారా పొందే డేటాను మీరు మీ కనెక్షన్లో
రీఛార్జ్ చేసిన బేసిక్ ప్యాక్‌ని వాడుకోవచ్చు.
రూ.29 ప్లాన్.
జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.29 ద్వారా యూజర్లు 2.5GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ కోసం ప్రత్యేక వ్యాలిడిటీ ఉన్న యూజర్లు కనెక్షన్లోని యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటు గడువు ముగిసేవరకు ఈ డేటా ప్లాన్‌ను వాడుకోవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అన్‌లిమిటెడ్ డేటా అయిపోతే, ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసే వ్యక్తులు ఇందులో మిగిలిన డేటాను కలిగి ఉంటే, తర్వాత అపరిమిత డేటా ప్లాన్ తర్వాతి రోజు వరకు వాడుకోవచ్చు. ఆ తర్వాతే రూ.29 ప్లాన్లోని డేటా వాడుకోవడం ప్రారంభమవుతుంది.
వీటి తో పాటు ప్లాన్ ధర రూ.25 ద్వారా యూజర్లు 2 GB డేటాను పొందుతారు. ప్లాన్ ధర రూ.15 ద్వారా యూజర్లు 1 GB డేటాను పొందుతారు.
=====================
0 Komentar