LIVE: Launch of LVM3-M4/CHANDRAYAAN-3 Mission from SDSC SHAR, Sriharikota
చంద్రయాన్-3 ప్రయోగం - ఎల్వీఏం-3 ఎం4 రాకెట్ లైవ్
=========================
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నాలుగేళ్ల కిందట
చెదిరిన 'జాబిల్లి' కలను తిరిగి సాకారం చేసుకునేందుకు
రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగం శుక్రవారమే. అంతరిక్ష రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర ఇస్రో- 2019లో చంద్రయాన్-2 ప్రయోగంలో తలెత్తిన సమస్యల నుంచి పాఠాలు నేర్చుకొని..
మరింత శక్తిమంతమైన, 'తెలివైన' వ్యోమనౌకతో తాజా ప్రయోగానికి
సన్నద్ధమైంది. అంతా సాఫీగా సాగితే- మధ్యాహ్న 2.35 గంటలకు ఎల్వీఏం-3 ఎం4 రాకెట్.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. వచ్చే నెలలో చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే- ఆ ఘనత సాధిం తొలి దేశంగా... చంద్రుడిపై
సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.
ప్రయోగం వివరాలు:
1. అత్యంత శక్తిమంతమైన ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్
మాడ్యూల్తో కూడిన చంద్రయాన్-3ని ప్రయోగిస్తారు.
2. చంద్రయాన్-3ని భూమి చుట్టూ ఉన్న 170x 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను
ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు.
3. తర్వాత చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్ -3ని పంపిస్తారు.
4. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక లూనార్ ఆర్బిట్
ఇన్సర్షన్ (ఎల్వోఐ) ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజిన్ ను మండించి
చంద్రయాన్-3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి
గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది.
5. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న
కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు.
6. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి..
ల్యాండర్, రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల
సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.
7. ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుంది. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్
నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూశారు. వాలు.. 120 డిగ్రీలను
మించకూడదు.
=========================
LIVE:
CHANDRAYAN – 3 MISSION
Date:
14-07-2023
Time:
2.35 PM
Place:
SDSC SHAR, Sriharikota
YouTube
Link: https://www.youtube.com/watch?v=q2ueCg9bvvQ
=========================
0 Komentar