Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCET 2023: Integrated Teacher Education Programme (ITEP) – Details Here

 

NCET 2023: Integrated Teacher Education Programme (ITEP) – Details Here

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 - ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే

==========================

ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్ 2023-24 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ) 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 42 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐటీఈపీ ప్రోగ్రామ్ లో అడ్మిషన్లు పొందవచ్చు.

కోర్సు వివరాలు:

అర్హత: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి లేదు.

సంస్థలు, సీట్ల వివరాలు: ఎన్సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 42 వివిధ వర్సిటీలు / ఆర్ఎస్ఐఈ / ఎన్ఎస్ఐటీలు, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ సంస్థల్లో 3950 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో 150 సీట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (లక్సెట్టిపేట) లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జాతీయ సంస్కృత విద్యాలయం (తిరుపతి)లో 50 సీట్లు, డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ (ఎచ్చర్ల) 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఇంగ్లిష్, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.650.

తెలుగు రాష్ట్రాలలోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-07-2023, 25-07-2023

దరఖాస్తు సవరణ తేదీలు: 20, 21-07-2023, 26-07-2023 & 27-07-2023

పరీక్ష కేంద్రం వివరాల వెల్లడి: 26-07-2023

========================

REVISED DATES

INFORMATION BULLETIN

REGISTGER

SIGN-IN

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags