PM YASASVI Entrance Test 2023: Young
Achievers Scholarship Entrance Test – All the Details Here
యశస్వి-2023: పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్
వైబ్రంట్ ఇండియా – పూర్తి వివరాలు ఇవే
========================
నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం యశస్వి' (యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా) స్కాలర్షిప్
స్కీమ్ 2023 ప్రవేశపరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర సామాజిక
న్యాయ,
సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 విద్యాసంవత్సరానికి గాను 30వేల స్కాలర్షిప్స్ అందించనున్నారు.
పీఎం యశస్వి
ప్రవేశ పరీక్ష 2023.
అర్హత: 8వ తరగతి/ 10వ తరగతి ఉత్తీర్ణత.
ప్రస్తుతం 9, 11 తరగతులు చదువుతున్న విద్యార్థులు
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థుల
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించరాదు.
ఓబీసీ,
ఈబీసీలతో పాటు డీనోటిఫైడ్ కుటుంబాల విద్యార్థులు, సంచారజాతులకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.
ఉపకార వేతనం: 9, 10 తరగతులకు గాను ఏడాదికి రూ.75 వేలు చొప్పున, 11, 12 తరగతులకు రూ.1,25,000 చొప్పున ఉపకారవేతనాలుగా చెల్లిస్తారు.
ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించేలా
స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి జమచేస్తారు.
ఎంపిక విధానం: యశస్వి ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక
ఉంటుంది.
పరీక్ష విధానం: ఈ పరీక్ష పెన్ను, పేపర్
విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, హిందీలో భాషల్లో నిర్వహించే ఈ
పరీక్ష రెండున్నర గంటల పాటు ఉంటుంది. మ్యాథమెటిక్స్కు 30 మార్కులు, సైన్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు చెరో 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్క 20 మార్కుల
చొప్పున మొత్తం 100 మార్కులకు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు మొబైల్ నంబర్, ఆధార్ కార్డు, ఆధార్తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన
అవసరం లేదు.
దరఖాస్తు చివరి తేది: 10.08.2023.
ప్రవేశ పరీక్ష: సెప్టెంబర్ 29, 2023
========================
========================
0 Komentar