TS TET 2023: Check the Update Here
తెలంగాణ టెట్ 2023: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష – వివరాలు ఇవే
=======================
తెలంగాణ రాష్ట్రంలో
ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)
నిర్వహించాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం
నిర్ణయించింది. చివరి సారి గతేడాది జూన్ లో విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా
పెండింగ్ లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ, మన ఊరు-మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం
శుక్రవారం (జులై 7) భేటీ అయింది.
విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీచర్ పోస్టుల
భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి
భేటీ కావాలని నిర్ణయించింది.
=======================
0 Komentar