తెలంగాణ ప్రభుత్వంలోకి
టీఎస్ఆర్టీసీ విలీనం - 43,373 మంది ఇక ప్రభుత్వ
ఉద్యోగులు - రూ. 60వేల కోట్లతో మెట్రో విస్తరణ
========================
TSRTC - టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు
మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు
రూపొందించేందుకు అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్
చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
సచివాలయంలో సుమారు ఐదు గంటలుగా కేబినెట్ భేటీ కొనసాగింది. ఈ భేటీ వివరాలను మంత్రి
కేటీఆర్ మీడియాకు వెల్లడించారు.
మెట్రో విస్తరణ
వివరాలు
హైదరాబాద్
మెట్రో రైలును రూ. 60వేల కోట్లతో
విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు, మియాపూర్ నుంచి లక్షీకాపూల్ వరకు మెట్రో విస్తరణ ఉంటుంది.
మూడు-నాలుగేళ్లలో మెట్రో విస్తరణ పూర్తవుతుంది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు, అలాగే.. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో
ఏర్పాటు జరుగుతుందని మంత్రి వివరించారు.
========================
Live: Ministers addressing the media after Telangana State cabinet meeting. @KTRBRS https://t.co/kXiII2BtNQ
— BRS Party (@BRSparty) July 31, 2023
0 Komentar