Wimbledon Men’s Final 2023: Carlos
Alcaraz beats Novak Djokovic to Claim First Wimbledon
వింబుల్డన్ 2023: 20 ఏళ్ల తర్వాత కొత్త వింబుల్డన్ విజేత గా 20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్
==========================
బిగ్-3 టెన్నిస్: ఫెదరర్, నాదల్, జకోవిచ్ మధ్య ఎన్నో అపురూప పోరాటాలు! చిరస్మరణీయంగా
మిగిలిపోయే మ్యాచ్లు! కానీ ఫెదరర్, నాదల్ జోరు
తగ్గాక.. జకోవిచ్ కి ఫైనల్లో సవాలు విసిరే ఆటగాళ్లే కనిపించలేదు. ఏ గ్రాండ్ స్లామ్
టోర్నీ అయినా అతనిదే ఆధిపత్యం. కానీ ఈ సారి వింబుల్డన్ తుదిపోరు మాత్రం అలాకాదు.
యువ సంచలనం అల్కరాస్ అద్భుతమే చేశాడు.
ఈ పోరులో
ఎన్నో మలుపులు! ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన సందర్భాలెన్నో! ఏకంగా 26 నిమిషాల పాటు సాగిన గేమ్ ఒకటి! కళ్లు చెదిరేలా దూసుకెళ్లిన
విన్నర్లు.. ఆడతరం కాని ఏస్లు.. నెట్ దగ్గర ఆటగాళ్ల విన్యాసాలు.. ఉర్రూతలూగించిన
మ్యాచ్. కోర్టులో కింద పడి పైకి లేస్తూ ఆటగాళ్లు సాగించిన పోరాటం.. ఆటలో వెనుకబడి
పుంజుకున్న వైనం.. ఎలా చూసినా ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయేదే!
వింబుల్డన్
లో యువ సంచలనం అల్కరాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం ఎంతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో
ఈ టాప్సీడ్ స్పెయిన్ ఆటగాడు 1-6, 7-6 (8-6), 6- 1, 3-6, 6-4తో రెండోసీడ్ జకోవిచ్పై విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన మారథాన్ పోరులో.. తొలి సెట్ ఓడినప్పటికీ
అద్భుతంగా పుంజుకున్న ప్రపంచ నంబర్ వన్ అల్కరాస్ గొప్ప విజయాన్ని సొంతం
చేసుకున్నాడు. కేవలం 34 నిమిషాల్లోనే ఒక్క
గేమ్ మాత్రమే కోల్పోయి తొలి సెట్ ముగించిన జకోవిచ్ ముందు అల్కరాస్ తేలిపోయేలా
కనిపించాడు.
సెట్ నుంచి
మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అల్కరాస్ పుంజుకోవడంతో ఈ పోరు అసలైన టెన్నిస్ మజాను
అందించింది. ఓ దశలో స్కోరు 2-2తో సమమైంది. అక్కడి
నుంచి ఇద్దరూ సర్వీస్లు నిలబెట్టుకుంటూ సాగారు. ఏడో గేమ్ జకో కిందపడి మరీ బంతిని
రిటర్న్ చేయగా.. వెంటనే అల్కరాస్ మరో వైపు బంతిని పంపి పాయింట్ నెగ్గాడు. తొమ్మిదో
గేమ్ చివరి పాయింట్ గెలిచే క్రమంలో కోర్టు బయట నుంచి రిటర్న్ పంపించిన జకో.. మళ్లీ
నెట్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి.. అద్భుత రీతిలో షాట్ కొట్టాడు. సర్వీస్
చేసేముందు జకో కాస్త ఎక్కువ సమయం తీసుకుంటూ.. అల్కరాస్ ఏకాగ్రతను దెబ్బతీసే
ప్రయత్నం చేశాడు. ఎవరూ తగ్గకపోవడంతో స్కోరు 6- 6తో సమమై టైబ్రేకర్ అనివార్యమైంది. ఇందులో జోరు ప్రదర్శించిన జకో 6-5తో సెట్ పాయింట్ మీద నిలిచాడు. కానీ ఆ తర్వాత బంతులను
నెట్కు కొట్టి రెండు పాయింట్లు కోల్పోయాడు. దీంతో 7-6తో నిలిచిన అల్కరాస్ బ్యాక్యాండ్ విన్నర్తో సెట్ గెలుచుకున్నాడు. ఇదే ఊపులో
మూడో సెట్లోనూ అల్కరాస్ ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్ నే బ్రేక్ సాధించిన
అతను.. 3-1తో దూసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిన గేమ్ గురించి ప్రత్యేకంగా
చెప్పుకోవాలి. సర్వీస్ నిలబెట్టుకోవడం కోసం జకో.. బ్రేక్ చేయడానికి అల్కరాస్
తీవ్రంగా పోటీపడడంతో ఆ గేమ్ దాదాపు 26 నిమిషాల పాటు సాగింది. దీని తర్వాత వరుసగా రెండు గేమ్ లు నెగ్గి అల్కరాస్ సెట్
సొంతం చేసుకున్నాడు.
తొలి సెట్
ఓడినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచిన అల్కరాసే విజేతగా నిలిచేలా
కనిపించాడు. కానీ జకోవిచ్ అంత సులువుగా వదలితేగా! మూడో సెట్ తర్వాత విరామం
తీసుకుని కోర్టులో తాజాగా అడుగుపెట్టిన జకో మళ్లీ జూలు విదిల్చాడు. అల్కరాస్
జోరుకు కళ్లెం వేస్తూ.. నాలుగో సెట్ గెలిచి.. మ్యాచ్ను మరింత రసవత్తరంగా మార్చాడు.
అయిదో గేమ్లో బ్రేక్ సాధించిన జకో, ఆపై మరో గేమ్
నెగ్గి 4-2తో పెత్తనం చలాయించాడు. అల్కరాస్ కు పుంజుకునే అవకాశం
ఇవ్వకుండా జకో తొమ్మిదో గేమ్ బ్రేక్ సాధించి సెట్ దక్కించుకున్నాడు. దీంతో
నిర్ణయాత్మక అయిదో సెట్ కు మ్యాచ్
మళ్లింది. కీలకమైన ఈ సెట్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానులను ఊపేసింది. ప్రతి
పాయింటు,
ప్రతి గేమ్ కు పోరు హోరాహోరే. పాయింట్ పోతే ప్రాణం
పోతుందన్నట్లు ఆటగాళ్లిద్దరూ తలపడ్డారు. తొలి గేమ్ లో జకో, రెండో గేమ్ అల్కరాస్ సర్వీస్ నిలబెట్టుకున్నారు. కానీ మూడో
గేమ్ లో జకో సర్వీసు అల్కరాస్ బ్రేక్ చేయడమే ఈ మ్యాచ్లో కీలక మలుపు. ఆపై తన
సర్వీస్ నిలబెట్టుకున్న అల్కరాస్ 3-1తో ఆధిక్యం సాధించాడు. ఆ సమయంలో కోపం పట్టలేక జకో రాకెట్ను విరగ్గొట్టాడు.
అయిదే గేమ్ లో గెలిచి జకో 2-3తో నిలిచినప్పటికీ..
వెంటనే గేమ్ నెగ్గి అల్కరాస్ 4-2తో విజయం దిశగా
సాగాడు. ఈ దశలో జకోవిచ్ గేమ్ బ్రేక్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ అల్కరాస్
ఆ అవకాశం ఇవ్వలేదు. తన సర్వీస్లు నిలబెట్టుకున్నాడు.
==========================
0 Komentar