Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

69th National Film Awards 2023: Best Actor – Allu Arjun – Best Actresses - Alia Bhatt-Kriti Sanon – Award Winners Details Here

 

69th National Film Awards 2023: Best Actor – Allu Arjun – Best Actresses - Alia Bhatt-Kriti Sanon – Award Winners Details Here

69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023: ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ – ఉత్తమ నటీమణులు - అలియా భట్-కృతి సనన్ – అవార్డుల విజేతల జాబితా ఇదే

========================

LIVE - “69th National Film Awards” - Presentation Ceremony – 17th October 2023

69వ జాతీయ చలనచిత్ర అవార్డులు” - ప్రత్యక్ష ప్రసారం – 17 అక్టోబర్ 2023

YouTube Link:

https://www.youtube.com/watch?v=fT1htN9fIHA

========================

మన దేశ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ 'పుష్ప: ది రైజ్ లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘అల్లు అర్జున్’ సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ నటి అవార్డును ఈసారి ఇద్దరు పంచుకున్నారు. అలియా భట్ (గంగూభాయి కారియావాడి), కృతిసనన్(మిమి)లకు దక్కాయి. సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్మ్, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్ ఫిల్మ్లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది.

2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన' ఎంపికైంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, ఉత్తమ గుజరాతీ చిత్రం 'ఛల్లో' (భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్కు వెళ్లింది), ఉత్తమ కన్నడ చిత్రంగా '777 చార్లీ', ఉత్తమ మలయాళీ చిత్రంగా 'హోమ్' ఎంపికయ్యాయి. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు 'ఆర్ఆర్ఆర్, ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్(ఆర్ఆర్ఆర), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ 'ఆర్ఆర్ఆర్' (శ్రీనివాస మోహన్)లకు జాతీయ అవార్డులు దక్కాయి.

జాతీయ అవార్డుల విజేతలు వీరే

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

• ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ)

ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)

ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ)

• ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్ -హిందీ)

ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)

ఉత్తమ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (ఆర్ఆర్ఆర్)

• ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమక్షిత్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్ (ఇరివిన్ నిజాల్ - మాయావా ఛాయావా)

ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్ఆర్ఆర్- కొమురం భీముడో)

• ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛల్లో షో-గుజరాతీ)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్ఆర్ఆర్ (రాజమౌళి)

ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)

ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ మేకప్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గుంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ ఇ (సర్దార్ ఉద్దమ్ సింగ్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉద్దమ్ సింగ్ (దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా)

ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కారియావాడి)

========================= 

Previous
Next Post »
0 Komentar

Google Tags