APPSC-RIMC Admission (July 2024 Term) –
Rashtriya Indian Military College Entrance Exam – Details Here
ఏపీపీఎస్సీ-
ఆర్ఐఎంసీ (జులై- 2024 టర్మ్) లో ఎనిమిదో
తరగతి ప్రవేశాలు – దరఖాస్తు వివరాలు ఇవే
=======================
భారత
ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)
జులై- 2024 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన
బాలురు,
బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్
కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది
ఆర్ఐఎంసీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జులై- 2024 టర్మ్
అర్హత:
గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి
ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు:
01.07.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.
02.07.2011 - 01.01.2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక
విధానం: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా
విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్(200
మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్ (125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వోస్ (50 మార్కులు) నిర్వహిస్తారు. రాత
పరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో
కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు
చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.
దరఖాస్తు
విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో
చెల్లించాలి. ఆరన్ఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి
అసిస్టెంట్ సెక్రటరీ(ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్
కమిషన్,
న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ
కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపించాలి.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తుకు
చివరి తేది: 15.10.2023.
పరీక్ష తేది:
02-12-2023.
=======================
=======================
0 Komentar