Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chandrayaan-3 Mission Soft-Landing

 

Chandrayaan-3 Mission Soft-LandingL

చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్

======================

UPDATE 25-08-2023

చంద్రయాన్- 3 - ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపైకి అడుగుపెట్టిన వీడియో విడుదల చేసిన ఇస్రో 

చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్- 3 సురక్షితంగా దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇస్రో తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది.

ల్యాండర్ నుంచి రోవర్ జారుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి అడుగుపెట్టిన దృశ్యాలను పంచుకుంది. గురువారం ఇస్రో మరో వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. "చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా జాబిల్లి చిత్రాన్ని ఎలా క్యాప్చర్ చేసిందో చూడండి" అంటూ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పంచుకుంది.

======================

చంద్రయాన్-బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కానుంది.

Date: 23/08/2023

Time: 5.20 PM to 6.30 PM

YouTube Link:

https://www.youtube.com/watch?v=DLA_64yz8Ss 

======================

======================

చంద్రయాన్-3 ప్రయాణం మరియు ఇతర పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

======================

ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. జులై 14న శ్రీహరికోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 (Chandrayaan-3).. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలోనే 40 రోజుల చంద్రయాన్-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఓ వీడియో రూపొందించింది.

ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 (Chandrayaan-3)ను రూపొందించినప్పటి నుంచి షార్ వేదిక వద్ద ప్రయోగం, రోదసిలోకి దూసుకెళ్లడం, భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారడం వంటివి ఇందులో చూపించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. విక్రమ్ ల్యాండర్ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్ రోవడ్ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్ రూపంలో వీడియోలో చూపించారు.

అన్ని అనుకూలిస్తే రేపు సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కాలుమోపనుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది.

======================

Memo.No. SS-15021/63/2023-SAMO-SSA, Dt: 21/08/2023

Sub: Samagra Shiksha, AP – SIEMAT – Chandrayan-3 – Broadcasted liveon August 23, 2023 to School Students and Teachers in all schools - Instructions to all DEOs & APCs of Samagra Shiksha in the State - Orders Issued – Reg.

Ref: Lr.D.O.No.10-97/2023/IS-15, dt:21.08.2023 of the Secretary Government of India, Ministry of Education, Dept. of School Education & Literacy, New Delhi.

<<<<>>>> 

 In the reference cited, the Secretary Government of India, Ministry of Education, Dept., of School Education & Literacy, New Delhi has stated that, India's pursuit of space exploration is on the verge of a remarkable milestone with the impending Chandrayaan-3 Mission, poised to achieve a landing on the Moon. This marks not only a quantum step forward for Indian Science, Engineering, Technology, and Industry but also for Brand India. This event will be broadcasted live on August 23, 2023, starting from l7:27 hrs IST. The live coverage will be available via multiple platforms, including the ISRO Website (https://www.isro.gov.in/), ISRO's official YouTube channel ('ISRO Official'), ISRO's Facebook page (https://www.facebook.com/ISRO), and DD National TV channel.

 The landing of India's Chandrayaan-3 on the moon is a monumental occasion that will not only fuel curiosity but also spark a passion for exploration within the minds of our youth. It will generate a profound sense of pride and unity as we collectively celebrate the prowess of Indian science and technology. It will contribute to fostering of an environment of scientific inquiry and innovation. The Hon’ble Prime Minister of India will also join the Nation in witnessing this momentous occasion.

 Therefore, all the District Educational Officers & Additional Project Coordinators, Samagra Shiksha in the State are hereby instructed to inform all the Head Masters of all Schools to issue advisories for convening of special Assembly of students and teachers in all the schools from 5.30 PM to 6.30 PM on 23.08.2023 so they could collectively witness the LIVE Streaming of Chandrayaan-3 landing on the moon without fail and furnish compliance report to this office.

DOWNLOAD PROCEEDINGS

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags