GATE 2024 – Graduate Aptitude Test in
Engineering - Details Here
గేట్-2024 – గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ - వివరాలు ఇవే
===================
UPDATE
17-03-2024
GATE-2024:
ఫలితాలు విడుదల
===================
UPDATE 06-01-2024
GATE 2024 – పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్ష
తేదీలు: 03-02-2024,
04-02-2024, 10-02-2024 & 11-02-2024.
===================
గ్రాడ్యుయేట్
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2024 నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ
స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ
సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈసారి గేట్ ను బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ఆఫ్ సైన్స్
(ఐఐఎస్సీ) నిర్వహించనుంది. గేట్-2024లో ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 24వ
తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి
3, 4, 10, 11
తేదీల్లనిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్లో సాధించిన స్కోర్ను బట్టి కేంద్ర
ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు
ఎంపిక చేస్తాయి.
గ్రాడ్యుయేట్
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024
అర్హతలు:
ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు:
అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష
విధానం: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక
చేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు.
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు: రూ.1800 (జనరల్ అభ్యర్థులకు), రూ.900(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు).
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్షలు
జరిగే ప్రాంతాలు...
తెలంగాణ:
హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.
ఏపీ: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 24-08-2023. 30-08-2023
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ కు చివరి తేది: 29-09-2023.
అపరాధ
రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 13-10-2023.
పరీక్ష
తేదీలు: 03-02-2024, 04-02-2024, 10-02-2024 & 11-02-2024.
పరీక్ష
ఫలితాల విడుదల: 16-03-2024.
===========================
===========================
0 Komentar