World Athletics Championships 2023:
Neeraj Chopra Wins Gold to Create History
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023: స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా
=======================
ప్రపంచ
అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకున్నాడు.
జావెలిన్ త్రోలో 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణం దక్కించుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా
జరిగిన ఫైనల్స్ లో జావెలిన్ ను 88.17 మీటర్లు విసిరి
అదరగొట్టాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి
భారతీయ ఆటగాడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు.
క్వాలిఫయర్స్ లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్ ను 88.77 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టిన నీరజ్.. ఫైనల్లో తొలి ప్రయత్నం విఫలమైనా.. రెండో ప్రయత్నంలో ఈటెను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత నీరజ్ చేసిన ప్రయత్నాల్లో జావెలిన్ 86.32, 84.64, 87.73, 83.98 మీటర్లు ఉన్నాయి. ఇక నీరజ్ తో పాటు ఫైనల్లో పోటీపడ్డ భారత అథ్లెట్స్ కిషోర్ జెనా 84.77మీటర్లతో ఐదో స్థానంలో, డీపీ మను 84.14 మీటర్లతో ఆరోస్థానంలో నిలిచారు. పాక్ క్రీడాకారుడు నదీమ్ అర్షద్ 87.82 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో మరియు జాకుబ్ వడ్లేజ్ (చెక్ రిపబ్లిక్) ఆటగాడు 86.67 మీటర్లు విసిరి తృతీయ స్థానం లోను నిలిచారు.
ప్రపంచ
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా గత
ఏడాది రజతం తో రికార్డులకెక్కాడు. ఈ ఏడాది స్వర్ణం తో మరో అడుగు ముందుకేశాడు. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో
భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది.
=======================
0 Komentar