Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2023: Apply for 1207 Stenographer Grade ‘C’ & ‘D’ Posts – Details Here

 

SSC Recruitment 2023: Apply for 1207 Stenographer Grade ‘C’ & ‘D’ Posts – Details Here

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1,207 స్టెనోగ్రాఫర్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

=======================

న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎన్ఎస్సీ)... దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ఆగస్టు 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

డిపార్ట్మెంట్ పేరు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ రెజువెనేషన్, ఇండియన్ మెటియోరాలాజికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ అఫైర్స్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తదితరాలు.

1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్)

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)

మొత్తం ఖాళీల సంఖ్య: 1,207. 

అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

వయోపరిమితి: 01-08-2023 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.

దరఖాస్తు రుసుము: రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 02.08.2023 నుంచి 23.08.2023 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: అక్టోబర్, 2023.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.

=======================

NOTIFICATION

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags