SSC Recruitment 2023 – Apply for 1324 Junior
Engineer Posts
ఎస్ఎస్ సీ రిక్రూట్మెంట్
2023: గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ నియామకాలు (1324) – జీత భత్యాలు: నెలకు
రూ.35,400
- రూ.1,12,400
=========================
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ బ్రాంచీల్లో
డిప్లొమా,
సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివినవారికి స్టాఫ్
సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్స్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది.
దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థల్లో
గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు.
గ్రూప్-బి
(నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్
మొత్తం ఖాళీలు:
1324
విభాగాలు:
జూనియర్ ఇంజినీర్ గా నియమితులైన వారికి కేంద్ర జలసంఘం, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, కేంద్ర జల, విద్యుత్ రిసెర్చ్
స్టేషన్,
మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్
ప్రాజెక్టు, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్
ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్, పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్ వేస్ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే
అవకాశం లభిస్తుంది.
అర్హతలు:
డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్), తత్సమాన
డిగ్రీ చదివినవారు అర్హులు.
వయోపరిమితి:
పోస్టులకు అనుగుణంగా 18-32 సంత్సరాల వయసు
ఉండాలి. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి. భారతీయులై ఉండాలి.
కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.
జీత భత్యాలు:
సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400 - రూ.1,12,400 ఉంటుంది.
పరీక్ష
విధానం: ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1 ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆబ్జెక్టివ్
తరహాలో నిర్వహిస్తారు. పేపర్-2 ఆఫ్ లైన్ లో జరిగే
(డిస్క్రిప్టివ్) రాత పరీక్ష. పేపర్-1లో మొత్తం 200 మార్కులకు.. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్-2లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్
పరీక్ష. పేపర్-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
దరఖాస్తు
ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెలకు
ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు
చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభం: 26.07.2023
ఆన్లైన్
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 16.08.2023.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష (పేపర్-1) షెడ్యూల్: అక్టోబర్, 2023.
=========================
=========================
0 Komentar