TTD: నవంబర్-2023 నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం & వసతి గదుల బుకింగ్ తేదీల వివరాలు ఇవే
=========================
2023 నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేసింది. ఇందులో భాగంగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునేందుకు వీలుకల్పించింది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార
సేవాటికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు
మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం
టికెట్లను ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శన
టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో వసతి గదులను బుక్ చేసుకునేందుకు బుకింగ్ ను
ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు
అనుమతిస్తారు.
2023 నవంబరు
నెలకు సంబంధించిన తేదీల వివరాలు ఇవే
ఆన్లైన్
లక్కీడిప్ తేదీలు: ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్ల తేదీలు: ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు
వర్చువల్
సేవా టికెట్ల తేదీ: ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు
ఆంగప్రదక్షిణం
టోకెన్ల విడుదల తేదీ: ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు
శ్రీవాణి
ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్ల విడుదల తేదీ: ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు
వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా విడుదల తేదీ: ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు
ప్రత్యేక
ప్రవేశ దర్శనం (రూ.300): ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు
వసతి గదుల బుకింగ్
తేదీ: ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు
=========================
=========================
0 Komentar