APIE Recruitment 2023: Apply for 396 Inclusive
Education Resource Persons – Details Here
ఏపీ: భవిత
కేంద్రాల్లో 396 సహిత విద్యా రిసోర్స్ పర్సన్
పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
======================
ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 4 నుంచి 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ జాబితాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
సహిత విద్యా
రిసోర్స్ పర్సన్: 396 పోస్టులు
వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి 18-54 ఏళ్లు.
దరఖాస్తు రుసుం:
రూ.100.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
వివరాలకు:
7993329117.
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04-09-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2023.
======================
0 Komentar