Apple – iPhone
15, iPhone 15 Pro & Apple Watch Series 9 Launched – Details Here
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ & వాచ్ సిరీస్ 9 విడుదల – ధర & ఫీచర్ల
వివరాలు ఇవే
========================
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా 'వండర్ లస్ట్' పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో యాపిల్
కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్
వాచ్ లు 'వాచ్ సిరీస్ 9', 'వాచ్ అల్ట్రా 2'ను విడుదల చేసింది. ఈ సారి టైప్-సీతో కూడిన
ఛార్జింగ్ను ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో అమర్చడం విశేషం. ఇక వాచ్ బ్యాటరీ
లైఫ్ ఎక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. ఐఫోన్ 15 సిరీస్
ఫోన్లలో చాలా కొత్త ఫీచర్లు ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్లో ఎయిర్యాడ్లను యాపిల్ విడుదల
చేయలేదు. బహుశా ఈ ఏడాది చివరలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్
ఫీచర్స్, ధరల వివరాలు ఇవే
ఐఫోన్ 14 మోడల్లో ఉన్నట్లే ఐఫోన్ 15లోనూ 6.1 అంగుళాల తెర, ఐఫోన్ 15 ప్లస్లో 6.7 అంగుళాల తెరను అమర్చారు. ఓఎల్ఈడీ సూపర్ రెటీనా
డిస్ప్లే ఇస్తున్నారు. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఇవి లభ్యం కానున్నాయి. డైనమిక్
ఐలాండ్తో కూడిన కొత్త నాచ్ డిస్ప్లే, వెనక వైపు .ఎక్స్ టెలిఫొటో సామర్థం
ఉన్న 48 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్ను ఇచ్చారు. దీంతో
హైరెజల్యూషన్ ఫొటోస్, వీడియోలను తీసుకోవచ్చు. తక్కువ కాంతిలో కూడా ఫొటోలు
తీసుకునే విధంగా రూపకల్పన చేశారు. ఏ16 బయోనిక్ చిప్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్బీ-సీ పోర్ట్ కూడిన ఛార్జింగ్ ఈ సారి కొత్తగా
ఇచ్చారు. ఐఫోన్ 15 ధరలు భారత్లో రూ. 79,900 (799 యూఎస్ డాలర్లు) నుంచి ప్రారంభం అవుతాయి. ఇక ఐఫోన్ 15 ప్లస్ ధరలు
రూ. 89,899 (899 యూఎస్ డాలర్లు) నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో
మ్యాక్స్..
ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల తెర, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో 6.7 అంగుళాల
డిస్ప్లే ఇచ్చారు. ఈసారి ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడళ్లు నాలుగు వేరియంట్లలో లభించనున్నాయి. టైటానియం వైట్, నేచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం
బ్లాక్ లో వీటిని తీసుకొచ్చారు. ఈ ఫోన్లలో వెనక వైపు 48 మెగాపిక్సల్
కెమెరా అమర్చారు. 3 ఫోకల్ లెంగ్త్ కెమెరా సైతం ఇచ్చారు. ఐఫోన్ 15 ప్రోలో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 15ప్రో
మ్యాక్స్ 5ఎక్స్ టెలిఫోటో లెన్స్ను ఇచ్చారు. ఇక 128 జీబీ స్టోరేజ్తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధరను భారత్లో రూ.1,34,900 (999 డాలర్లు), 256జీబీ స్టోరేజ్తో కూడి ప్రోమాక్స్
ధర రూ.1,59,900 (1199 డాలర్లు)గా నిర్ణయించారు.
వాచ్ సిరీస్ 9.. ఫీచర్స్, ధర..
వాచ్ సిరీస్ 9ను ఈసారి వినూత్నంగా తీసుకొచ్చారు.
లెథర్ ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేశారు. పర్యావరణహితంగా రూపుదిద్దారు. దీనిలో
కొత్తగా ఎస్ చిప్ను అమర్చారు. ఇది సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్.
గతవాటితో పోలిస్తే ఇది 30 శాతం వేగంగా
పనిచేస్తుంది. ఉత్తమంగా హెల్త్ ట్రాక్ చేస్తుంది. యాపిల్ డివైజ్లతో కనెక్ట్
కావచ్చు. లోకేషన్ను మెరుగ్గా ట్రేస్ చేయవచ్చు. ఈ వాచ్ డబుల్ ట్యాప్ ఫీచర్ ఇచ్చారు.
దీని ధర భారత్లో రూ.41,900 నుంచి ప్రారంభం అవుతుంది.
వాచ్ అల్ట్రా 2
యాపిల్ వాచ్ అల్ట్రా త్వరగా ఛార్జింగ్ అయ్యేవిధంగా డిజైన్
చేశారు. 36 గంటల పాటు బ్యాటరీ వస్తుంది. 3000 నిట్స్ బ్రెట్నెస్, ఫ్లాష్లోట్ బూస్ట్, న్యూ గెశ్చర్స్, యాక్షన్ బటన్, ఐఫోన్ ట్రేస్
చేయడం వంటివి ఇచ్చారు. డబుల్ ట్యాప్ ఫీచర్, సూర్యకాంతిలో
స్పష్టంగా కనిపించేవిధంగా డిస్ప్లే అమర్చారు. ఈ వాచ్ ధరలు 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి.
========================
0 Komentar