Flipkart Big Billion Days Sale 2023:
Festive Season Sale Dates Announced – Check the
Offer Details Here
ఫ్లిప్‌కార్ట్
బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023: పండుగ సీజన్ సేల్
తేదీలు ఇవే – ఆఫర్ వివరాలు ఇవే
=========================
ఈ-కామర్స్
దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఏటా నిర్వహించే 'బిగ్ బిలియన్
డేస్ (Flipkart
Big Billion Days)' ప్రత్యేక సేల్ కు సిద్ధమైంది. ఇప్పటికే వెబ్సైట్లో ప్రత్యేకంగా ఓ
మైక్రోసైట్ ను క్రియేట్ చేసి వివిధ ఆఫర్లను ప్రకటించింది. తాజాగా ప్రత్యేక సేల్ తేదీలను
ప్రకటించింది. అక్టోబర్ 08 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ సేల్ జరగనుంది. ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54, పిక్సెల్ 7ఏ సహా వివిధ ఎలక్ట్రానిక్, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలపై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే
ప్రకటించింది.
ఇప్పటికే
ప్రత్యేకంగా ప్రారంభించిన టీజర్ వెబ్సైట్లో ఫ్లిప్‌కార్ట్ (Flipkart Big
Billion Days) ఏయే ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయో ప్రకటించింది. ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54, పిక్సెల్ 7ఏ, పోకో ఎక్స్
ప్రో,
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, రెడ్మీ నోట్ 12 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఏ34, పోకో ఎఫ్5, శాంసంగ్ గెలాక్సీ ఏ23, ఒప్పో రెనో 10, మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా జీ54, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 సహా మరికొన్ని స్మార్ట్ఫోన్లపై గణనీయ తగ్గింపు ఉండనున్నట్లు వెబ్సైట్ ద్వారా
తెలుస్తోంది. మోటోపై సెప్టెంబర్ 28న, వివోపై 29న, ఇన్ఫీనిక్స్ పై 30న, రియల్మీ పై అక్టోబర్ 02న, శాంసంగ్ పై 3న, పోకో పై 4న, గూగుల్ పిక్సెల్పై
అక్టోబర్ 05న, రెడ్మీ
ఫోన్లపై అక్టోబర్ 05న ఆఫర్లను
ప్రకటించనున్నట్లు తెలిపింది.
బిగ్ బిలియన్
సేల్ లో భాగంగా వివో టీ2 ప్రో 5జీ, మోటోరోలా
ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఎస్ఈ, పిక్సెల్ 8 సిరీస్, వివో వీ29
సిరీస్,
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్లు విడుదల కానున్నాయి.
వీటితో పాటు ఇటీవలే విడుదలై మోటో జీ54 5జీ, రియల్మీ సీ51, గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్లపై రాయితీ లభించనుంది. ఐఫోన్ 14
సిరీస్,
ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్ పై 50-80% వరకు ఆఫర్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. పాదరక్షలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాల వంటి ఫ్యాషన్ ఉత్పత్తులపై 90 శాతం వరకు ఆఫర్లు ఉన్నట్లు వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. బ్యూటీ ప్రోడక్ట్స్్పన 60- 80శాతం వరకు రాయితీ లభించనున్నట్లు పేర్కొంది. హోమకర్ విభాగంలో 80 శాతం, ఫర్నీచర్పై 85శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రిఫ్రిజిరేటర్లపై 70శాతం, 4కే స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు రాయితీ ఉండొచ్చని పేర్కొంది. వాషింగ్ మెషీన్లు రూ.5,000 నుంచే లభించనున్నట్లు వెబ్సైట్లో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి ఆయా ఉత్పత్తులపై తగ్గింపు కూడా ఉంటుందని తెలిసింది.
=========================
=========================
0 Komentar