IDBI Recruitment 2023: Apply for 600
Junior Assistant Manager Posts – Details Here
ఐడీబీఐ
బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు – అర్హత
మరియు దరఖాస్తు వివరాలు ఇవే
=========================
ఐడీబీఐ 600 అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు
నోటిఫికేషన్ వెలువడింది. మణిపాల్ (బెంగళూరు), నిట్టే
(గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (6 నెలలు తరగతి
పాఠాలు,
2 నెలలు ఇంటర్న్షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్) పాటు పీజీడీబీఎఫ్ లో శిక్షణ ఇస్తారు. కోర్సు
విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్తోతోపాటు జూనియర్
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్- ఓ) ఉద్యోగం లభిస్తుంది.
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ): 600 పోస్టులు (యూఆర్- 243, ఎస్సీ- 90, ఎస్టీ- 45, ఈడబ్ల్యూఎస్- 60, ఓబీసీ- 162)
అర్హత: ఏదైనా
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 31/08/2023 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు
పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.
ఎంపిక
ప్రక్రియ: అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన
వారు పర్సనల్ ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు. అందులో ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య
పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/
పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.200, ఇతరులు రూ. 1000 చెల్లించాలి.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
రాత పరీక్ష:
పరీక్షను మొత్తం 200 మార్కులకు
నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్, ఇంటర్ప్రైటేషన్
(60
ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ (60 ప్రశ్నలు, 60 మార్కులు)
అంశాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు
వస్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. పరీక్షలో రుణాత్మక మార్కులుంటాయి. తప్పుగా
గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు
చొప్పున కోత విధిస్తారు.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం (6 నెలలు)లో
నెలకు రూ.5000 ఇస్తారు. ఇంటర్న్షిప్ (2 నెలలు) సమయంలో నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినవారికి
రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వరకు వార్షిక వేతనం అందుతుంది.
ఆన్లైన్
రిజిస్ట్రేషన్/ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-09-2023.
ఆన్లైన్
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-09-2023.
ఆన్లైన్ పరీక్ష
తేదీ: 20-10-2023
========================
APPLY HERE (Turn Your Mobile)
========================
0 Komentar