Jio Air Fiber - Check Plans, Features & Locations
జియో ఎయిర్ ఫైబర్ - ప్లాన్‌ల మరియు
ఫీచర్‌ల వివరాలు ఇవే -
=====================
UPDATE 28-11-2023
జియో
హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఎయిర్ ఫైబర్ సేవలను తెలుగు రాష్ట్రాలలో విస్తరించినట్లు
జియో ఓ ప్రకటనలో తెలిపింది. హోమ్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్ హోమ్ సేవలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ సేవలు
అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏపీ లో 40 కి పైగా, తెలంగాణా లో 30 కి పైగా నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు
చెప్పారు.
=====================
రిలయన్స్
జియో ఎయిర్ ఫైబర్ నేడు (సెప్టెంబర్ 19) విడుదలైంది. దీన్ని వినాయక చవితి సందర్భంగా
మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఆగస్టు 28న జరిగిన 46వ సాధారణ వార్షిక సమావేశంలో
ప్రకటించింది. అప్పటి నుంచి టెక్ ప్రియుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. ఫీచర్లు, ప్లాన్ల వంటి విషయాలపై చాలా ఆతృతగా వేచిచూశారు.
జియో ఫైబర్ మరియు
జియో ఎయిర్ ఫైబర్ ఒకటి కాదా?
ఇది 5జీ ఆధారిత వైర్లెస్ వైఫై సర్వీస్. అత్యంత వేగంతో ఇల్లు, వ్యాపార అవసరాలకు ఇంటర్నెట్ను అందిస్తుంది. ప్రస్తుతం
అందుబాటులో ఉన్న వైర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగానే దీన్ని
జియో తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న జియోఫైబర్ తో దీన్ని పోల్చుకుని
పొరబడే అవకాశం ఉంది. జియో ఫైబర్.. బ్రాడ్బ్యాండ్ సర్వీసులను అందిస్తోంది. అంటే
ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ఇళ్లు, ఆఫీసులకు
ఇంటర్నెట్ సేవలను చేరువ చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన జియో ఎయిర్ ఫైబర్ మాత్రం
ఎలాంటి కేబుల్స్, వైర్లు అవసరం
లేకుండానే పనిచేస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా దగ్గర్లోని టవర్ నుంచి సిగ్నల్స్
అందుకొని ఇంటర్నెట్ ను అందిస్తుంది. అదీ బ్రాడ్బ్యాండ్ కంటే కూడా అధిక వేగంతో.
సింపుల్గా చెప్పాలంటే జియో ఎయిర్ ఫైబర్ ఒక వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అని
చెప్పొచ్చు. ఇంట్లో ఎన్ని డివైజ్లనైనా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు.
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ల వివరాలు ఇవే
1. రూ.599- 30Mbps, డిస్నీ+ హాటర్, సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీలు లభిస్తాయి.
2. రూ.899- 100Mbps, డిస్నీ+ హాట్ స్టార్, సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీలు లభిస్తాయి.
3. రూ.1199 - 100Mbps, నెట్ ప్లెక్స్, అమెజాన్
ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్, సోనీలివ్, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
జియో ఎయిర్
ఫైబర్ మ్యాక్స్ ప్లాన్ ల వివరాలు ఇవే
4. రూ.1499 - 300Mbps, నెట్ ఫ్లెక్స్, అమెజాన్
ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్జర్, సోనీలివ్, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
5. రూ.2499- 500Mbps, నెట్రిక్స్, అమెజాన్
ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్జర్, సోనీలివ్, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
6. రూ.3999 - 1Gbps, నెట్రిక్స్, అమెజాన్
ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్జర్, సోనీలివ్, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
ప్రస్తుతానికి
హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్ కతా, ముంబయి, పుణె నగరాల్లో జియో
ఎయిర్ ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా ఇతర ప్రాంతాలకూ
విస్తరించనున్నట్లు జియో తెలిపింది.
జియో ఎయిర్ ఫైబర్
ఫీచర్లు ఇవే
జియో ఎయిర్ ఫైబర్
అనేక ఫీచర్లున్నాయి. 1 జీబీపీఎస్ వేగం తో
ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైపై 6 సపోర్ట్ సహా ఓటీటీ సబ్స్క్రిప్షన్లను జియో అందిస్తోంది.
సెక్యూరిటీ ఫైర్వాల్ కూడా ఉంది. జియో ఎయిర్ ఫైబర్ ను యాప్ సాయంతో యూజర్లు
నియంత్రించవచ్చు. యాప్ ద్వారా కొన్ని వెబ్సైట్లను కూడా యూజర్లు బ్లాక్ చేయొచ్చు.
సాధారణ రౌటర్ ఏర్పాటుకు అవసరమైనట్లుగా ఎయిరైబర్ ఇన్స్టలేషన్ కోసం సాంకేతిక నిపుణుల
అవసరం ఉండదు. ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఇది పనిచేస్తుంది.
=======================
=======================
0 Komentar