RBI Recruitment
2023: Apply for 450 Assistant Posts – Details Here
రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్
పోస్టులు – డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు - పే స్కేల్: నెలకు రూ.20,700 నుంచి రూ.55,700.
=====================
UPDATE
15-12-2023
రిజర్వ్ బ్యాంక్ - అసిస్టెంట్ పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు
విడుదల
RBI లో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్ష
ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రాథమిక పరీక్ష నవంబర్ 18, 19 తేదీల్లో జరిగింది. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 31న నిర్వహించే ప్రధాన పరీక్షకు (Mains) హాజరు కావచ్చు. దేశవ్యాప్తంగా
ఆర్బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన
అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది.
=====================
UPDATE 07-11-2023
రిజర్వ్ బ్యాంక్ -
అసిస్టెంట్ పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
ప్రిలిమ్స్ పరీక్ష
తేదీలు: 18/11/2023 & 19/11/2023
రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్ష కాల్ లెటర్ లు విడుదలయ్యాయి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ సాయంతో కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్షను నవంబర్ 18, 19 తేదీల్లో, ప్రధాన పరీక్షను డిసెంబర్
31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు.. దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి
తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్ధుల ఎంపిక
ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు
నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది.
=====================
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు...
దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్
ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల
ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు
నిర్వర్తించాల్సి ఉంటుంది.
అసిస్టెంట్: 450 పోస్టులు
అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో
బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ
అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం
కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం
తప్పనిసరి.
వయస్సు: 01-09-2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల(జనరల్) సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.20,700 నుంచి రూ.55700.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్
ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్) లో ఇంగ్లిష్
లాంగ్వేజ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(35 ప్రశ్నలు - 35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
ప్రధాన పరీక్ష(ఆబ్జెక్టివ్) లో రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.
మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్ధులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్
(ఎల్పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో
నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్
సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.50.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-09-2023
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04-10-2023
ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్ తేదీలు: 21-10-2023 & 23-10-2023.
ఆన్లైన్ మెయిన్ టెస్ట్ తేదీ: 02-12-2023
==========================
APPLY
HERE (Turn Your Mobile)
==========================
0 Komentar