Santoor Scholarship Programme 2023-24
for Women – Details Here
మహిళల కోసం
సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24 – అర్హత మరియు స్కాలర్‌షిప్
వివరాలు ఇవే
==========================
గ్రామీణ
ప్రాంత విద్యార్థినులు ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక శక్తి సరిపోక ఉన్నతవిద్యలో
చేరలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకొని, చదువులో రాణించేలా చూడడానికి విప్రో సంస్థ ‘సంతూర్ ఉపకారవేతనా’లను
అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రకటన వెలువడింది. ఇంటర్ పూర్తిచేసిన బాలికలు
దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్థికంగా
వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్ కేర్, విప్రో కేర్స్ కలిసి వీటిని అందిస్తున్నాయి. ఇవి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు
రాష్ట్రాల నుంచి ఏడాదికి 1900 మందికి ఈ
ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఇప్పటి దాకా 6000 మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఈ
తోడ్పాటుతో ఉన్నత విద్యలో రాణిస్తున్నారు.
హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్స్
కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు
చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది. అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన
అర్హులను ఎంపిక చేస్తారు.
అర్హతలు: పదో
తరగతి,
ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివుండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు
చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు
పూర్తిచేసినవారై ఉండాలి. 2023-24 లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. కనీసం
మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న
డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.
స్కాలర్‌షిప్:
ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా
రూ.రెండువేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో
జమవుతుంది. ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటర్ తర్వాత
ఉండే వివిధ యూజీ కోర్సులు చదవడానికి ఈ స్కాలర్‌షిప్పు ఉపయోగపడుతుంది.
దరఖాస్తుల
స్వీకరణకు చివరి తేది: 31-10-2023
==========================
==========================
0 Komentar