SBI Recruitment 2023: Apply for 2000 Probationary
Officer Posts – Details Here
ఎస్బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 63,000
========================
UPDATE
24-10-2023
ఎస్బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల ప్రిలిమినరీ
పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల
నియమకాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత ప్రాథమిక రాత పరీక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగనున్నాయి. దరఖాస్తు చేసుకున్న
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ వివరాలతో పరీక్ష అడ్మిట్
కార్డులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,000 పీవో ఖాళీలు భర్తీ కానున్నాయి.
అభ్యర్థులను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్ సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ద్వారా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి
ఉంటుంది. బేసిక్ పే రూ.41,960 అందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో
చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్
నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
========================
దేశంలోని
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్…
పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత,
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 07.09.2023 నుంచి 27.09.2023 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులను
ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్
బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ప్రొబేషనరీ
ఆఫీసర్: 2,000 పోస్టులు (ఎస్సీ- 300, ఎస్టీ - 150, ఓబీసీ - 540, ఈడబ్ల్యూఎస్ - 200, యూఆర్-810)
అర్హతలు:
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి (01.04.2023 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు బేసిక్ పే రూ.41,960. (పూర్తి శాలరీ 63,840 వరకు)
దరఖాస్తు
రుసుము: రూ .750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు
మినహాయింపు ఉంటుంది).
ఎంపిక
విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు
రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.
తెలుగు
రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభ తేదీ: 07.09.2023
ఆన్లైన్ దరఖాస్తు
చివరి తేదీ: 27.09.2023
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్లోడ్: 2023, అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం.
స్టేజ్ 1- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2023.
ప్రిలిమినరీ
పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్, డిసెంబర్ 2023.
మెయిన్
ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్, డిసెంబర్ 2023.
స్టేజ్ 2- ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: డిసెంబర్ 2023/ జనవరి 2024.
ప్రధాన
పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2023/ జనవరి 2024.
ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.
ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.
ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.
తుది ఫలితాల
ప్రకటన: ఫిబ్రవరి/ మార్చి 2024.
========================
APPLY HERE (Turn Your Mobile)
========================
0 Komentar