SSC Recruitment 2023: Apply for 7547
Delhi Police Constable Posts – Details Here
దిల్లీ
పోలీసు విభాగంలో 7547
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పోస్టులు – దరఖాస్తు
వివరాలు ఇవే
=======================
దేశ రాజధాని
దిల్లీలోని పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్
సెలక్షన్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు
సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు:
7547
కాని
స్టేబుల్(ఎగ్జిక్యూటివ్)- పురుషులు: 5,056 పోస్టులు
(జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302)
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-
మహిళలు: 2,491 పోస్టులు (జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్ - 268, ఓబీసీ - 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150)
అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్
లైసెన్స్(ఎల్ఎంవీ) కలిగి ఉండాలి. జీత భత్యాలు: పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100)
దరఖాస్తు
రుసుము: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు) దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ
టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్
వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్ లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/
కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్
ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్ నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్ బ్రౌజింగ్ తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష
వ్యవధి 90 నిమిషాలు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01-09-2023
దరఖాస్తు
స్వీకరణకు చివరి తేది: 30-09-2023
కంప్యూటర్
ఆధారిత పరీక్ష: 14-11-2023 నుండి 05-12-2023.
ఎలా దరఖాస్తు
చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.
=======================
=======================
0 Komentar