T-20 International
Records: Nepal vs Mongolia T20I Match – Check the Records Here
నేపాల్ మరియు
మంగోలియా జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో పలు రికార్డు లు నమోదు
=======================
ప్రస్తుతం చైనా
లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2022 లలో (Asian Games) పురుషుల క్రికెట్ లో మొదటి రోజే సంచలన రికార్డులు నమోదు అయ్యాయి.
నేపాల్ మరియు
మంగోలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మంగోలియా బౌలింగ్ లో నేపాల్ బ్యాటర్లు
చెలరేగిపోయారు. ఈ క్రమంలో పలు అంతర్జాతీయ రికార్డులను నమోదు చేశారు. అత్యంత
వేగవంతమైన అర్ధశతకం, వేగవంతమైన సెంచరీ, టీ20ల్లో అత్యధిక స్కోరు
చేసిన జట్టు, భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగానూ
రికార్డు సృష్టించింది.
=========================
1. అత్యంత
వేగవంతమైన హాఫ్ సెంచరీ:
నేపాల్
బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ (52 నాటౌట్: 10 బంతుల్లో 8 సిక్స్లు)
అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.
దీపేంద్ర సింగ్ 9 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.
అంతకుముందు భారత బ్యాటర్ యువరాజ్ సింగ్ పేరిట (12 బంతుల్లో) ఈ రికార్డు ఉంది. దీపేంద్ర కూడా ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు బాదేశాడు.
===========================
2. అత్యంత
వేగవంతమైన సెంచరీ:
కుశాల్ మల్లా
అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన బ్యాటర్ గా అవతరించాడు. కేవలం 34 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. కుశాల్ మొత్తం 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 12 సిక్స్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సెంచరీ రికార్డు
దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. అతడు బంగ్లాదేశ్ పై 35 బంతుల్లోనే (2017లో) శతకం కొట్టాడు.
===========================
3. ఒక
జట్టు అత్యధిక స్కోరు:
మంగోలియాపై
నేపాల్ 20 ఓవర్లలో 314/3 స్కోరు చేసింది. టీ20ల్లో ఒక జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం
విశేషం. 2019లో ఐర్లాండ్ పై అఫ్గానిస్థాన్ 278/3 స్కోరు సాధించింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా
ఉండేది. దానిని నేపాల్ అధిగమించింది.
===========================
4. అత్యధిక
పరుగుల తేడాతో విజయం:
అత్యధిక పరుగుల
తేడాతో గెలిచిన జట్టుగా నేపాల్ అవతరించింది. మంగోలియాపై 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటైంది.
మంగోలియా బ్యాటర్ దావసురెన్ (10) మాత్రమే రెండంకెల
స్కోరు చేశాడు. ఇంతకుముందు టర్కీపై చెక్ రిపబ్లిక్ 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు నేపాల్ ఆ రికార్డును తుడిచిపెట్టింది.
===========================
5. ఒక
ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు:
ఒక ఇన్నింగ్స్
లో అత్యధిక సిక్స్ లు (26) బాదిన టీం గా నేపాల్ మరో రికార్డు నమోదు చేసింది.
===========================
6. అత్యధిక
స్ట్రైక్ రేట్ ఇన్నింగ్స్:
దీపేంద్ర
సింగ్ ఐరీ పది బంతుల్లో 52 పరుగులు సాదించారు. ఐరీ ఈ ఇన్నింగ్స్ లో 520 స్ట్రైక్ రేట్
తో రికార్డు నమోదు చేశాడు.
===========================
7. వరుసగా
6 సిక్స్ లు:
దీపేంద్ర
సింగ్ ఐరీ తాను ఎదుర్కొన్న మొదటి 6 బంతులలో 6 సిక్స్ లు కొట్టాడు. తాను ఎదుర్కొన్న
10 బంతులలో 8 సిక్స్ లు ఉన్నాయి.
6, 6, 6, 6, 6,
6, 2, 6, 6, 2 – 52 (10) – 8*6
==========================
8. టీ20ల్లో 300కిపైగా పరుగులు
చేసిన ఏకైక జట్టు:
టీ20ల్లో 300కిపైగా పరుగులు
చేసిన ఏకైక జట్టుగా నేపాల్ నిలిచింది.
===========================
===========================
0 Komentar