AAI Recruitment 2023: Apply for 496
Junior Executive Posts – Details Here
ఎయిర్
పోర్ట్స్ అథారిటీలో 496 జూనియర్
ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు
రూ.40,000-1,40,000.
======================
ప్రభుత్వ రంగ
సంస్థ- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టుల
భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ లేదా ఏదైనా
విభాగంలో బీఈ బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్
సబ్న్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
చేస్తారు.
జూనియర్
ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్): 496 పోస్టులు
అర్హత:
బీఎస్సీ ఫిజిక్స్, ఏదైనా విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30/11/2023 నాటికి 27 సంవత్సరాలు
మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు
పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
నెలకు రూ.40,000-1,40,000.
ఎంపిక
విధానం: ఆన్లైన్ పరీక్ష, అప్లికేషన్
వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్ స్టాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, బ్యాక్
గ్రౌండ్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01.11.2023.
ఆన్లైన్
దరఖాస్తుల చివరి తేదీ: 30.11.2023.
======================
======================
0 Komentar