A.P - CBSE - Question
Papers as per CBSE Exam Pattern for Classes VIII & IX to the 1000
CBSE Affiliated Govt Management Schools w.e.f. FA -2 Exams
ఏపీ: సీబీఎస్ఈ
పాఠశాలలలో పరీక్షల విధానంలో మార్పు - 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
===========================
ఏపీ లో సీబీఎస్ఈ
గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు ఫార్మెటివ్, సమ్మెటివ్
పరీక్షలుండగా వాటిని పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా
మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నారు. పీడబ్ల్యూటీలు మొత్తం
నాలుగు ఉంటాయి. టర్మ్ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
పదో తరగతిలో
అయిదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు ఉంటుంది. మూడో భాష హిందీ ఉండదు. ఆరో
సబ్జెక్టుగా స్కిల్ సబ్జెక్టును అమలు చేయనుండగా 50 మార్కులు థియరీ, 50 మార్కులు
ప్రాక్టికల్స్ ఉంటాయి.
===========================
Rc.No:ESE02/878/2023-MODAL
SCHOOL-CSE, Dated:01/10/2023
Sub: School
Education - A.P. Model Schools - CBSE -Question papers as per CBSE Examination
pattern for Classes VIII &IX to the 1000 CBSE Affiliated Government
Management Schools in Andhra Pradesh State w.e.f. Formative Assessment -2 exams
- Certain Instructions- Issued- Reg.
===========================
0 Komentar