AP: Gazette Notification
Released for Implementation of GPS
ఏపీ: జీపీఎస్ అమలుకు
గెజిట్ నోటిఫికేషన్ జారీ
======================
ఏపీ లో గ్యారంటీడ్
పింఛను పథకం బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో చట్టం అమల్లోకి వచ్చినట్లు
ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. మూలవేతనంలో 50% మేర పింఛను చెల్లించేలా టాప్ అప్ మొత్తాన్ని కలుపుతామని
ప్రభుత్వం పేర్కొంది. యాన్యూటీ మొత్తం తగ్గితే కనీస పింఛను రూ.10వేలు చెల్లించేలా టాప్ అప్ కలిపి చెల్లించనుంది. డీఆర్
ఉంటుంది. 60% ఇచ్చే స్పౌజ్ పింఛనులోనూ తగ్గిన
మొత్తాన్ని భర్తీచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. జీపీఎస్ ప్రయోజనాలు పొందేందుకు
పదవీవిరమణ చేస్తే కనీసం పదేళ్ల సర్వీసు చేసి ఉండాలి.
స్వచ్ఛంద
పదవీవిరమణ చేస్తే కనీసం 20ఏళ్ల సర్వీసు
ఉండాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం పదవీవిరమణ చేయిస్తే కనీసం 33ఏళ్ల సర్వీసు ఉండాలి. సీపీఎస్ ఉద్యోగులు నిర్దేశించిన
వ్యవధిలో ఏపీజీపీఎస్ ను ఎంపిక చేసుకోవాలి. ప్రాన్ ఖాతా నుంచి ఉద్యోగి చేసిన
పాక్షిక ఉపసంహరణలు, తుది ఉపసంహరణ
ఆధారంగా జీపీఎస్లో దామాషా తగ్గింపు ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా టాప్ అప్
కాంపొనెంట్, లేదా కొంతభాగాన్ని నిలుపుదల చేయడానికి, ఉపసంహరించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
======================
======================
AP GPS Bill 2023 – ముఖ్యాంశాలు ఇవే
=========================
0 Komentar