Asian Game 2023: India
Top 4 in the Medal Table with Record 107 Medals – Check the Highlights Here
ఏషియన్
గేమ్స్ 2023: 60 ఏళ్ల ఏషియన్ గేమ్స్
చరిత్రలో 107 పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శన
======================
పతకాల పట్టికలో నాలుగో స్థానంలో భారత్
ముఖ్యాంశాలు మరియు వీడియో హైలైట్స్
======================
ఆసియా
క్రీడల్లో 2018లో 70 పతకాలతో 8వ స్థానంలో నిలిచిన
భారత్.. ఈసారి 107 పతకాలతో నాలుగో స్థానానికి
ఎగబాకింది. 60 ఏళ్ల ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు
ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం
28 స్వర్ణం, 38 రజతం, 41 కాంస్య పతకాలు
ఏషియన్
గేమ్స్‌లో భారత్ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యల తో భారత
అథ్లెట్లు 107 పతకాలను ఖాతాలో వేసుకున్నారు. 60 ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ
ప్రదర్శన కావడం గమనార్హం. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలవగా.. భారత్ నాలుగో
స్థానంలో నిలిచింది. 2018లో 70 పతకాలే సాధించిన ఇండియా.. ఈసారి అదనంగా 37 పతకాలు సాధించడం గమనార్హం.
ఏషియన్
గేమ్స్ చరిత్రలో తొలిసారి భారత్‌కు ఈసారి బ్యాడ్మింటన్‌లోనూ స్వర్ణ పతకం దక్కింది.
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి
బ్యాడ్మింటన్ డబుల్స్‌లో పసిడి పతకం సాధించారు. తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ సైతం
శనివారం స్వర్ణ పతకాన్ని గెలుపొందింది.
======================
0 Komentar